27.2 C
Hyderabad
September 21, 2023 21: 04 PM
Slider సినిమా

భారత్ అమెరికన్ క్రియేషన్స్ బహుభాషా చిత్రం “భారతీయన్స్”

నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా… సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత – ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా” ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ… రూపొందిన “భారతీయన్స్” చిత్రం సంచలన విజయం సాధించాలని వారు కోరుకున్నారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని… మాజీ సైనికా దుకారులు ఉద్వేగానికి గురయ్యారు.

నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ… మన సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ… మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పుతున్న చైనా పేరును తొలగించమని సెన్సార్ వారు చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికయినా తాను సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్రివిధ దళాల్లో పనిచేసిన మన దేశ ముద్దుబిడ్డలైన సైనికాధికారులు “భారతీయన్స్” చిత్రం చూసి మెచ్చుకోవడం… తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు దర్శకుడు దీన్ రాజ్. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరైన కపిల్ కుమార్, హీరోల్లో ఒకరైన నీరోజ్ పుచ్చా ఫాదర్ రమణ మూర్తి, మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఫైట్స్: జూడో రాము, ఎడిటర్: శివ సర్వాణి, పి.ఆర్.ఓ: దీరజ్-అప్పాజీ, సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల, మ్యూజిక్ : సత్య కశ్యప్ & కపిల్ కుమార్, ప్రొడ్యూసర్ : డా; శంకర్ నాయుడు అడుసుమిల్లి, డైరెక్టర్: దీన్ రాజ్!!

Related posts

గుస్సాడి డాన్స్ కు జాతీయ స్థాయి గుర్తింపుపై గోండుల హర్షం

Satyam NEWS

బ్రాహ్మణ నిత్యాన్నదాన నూతన సత్ర భవన నిర్మాణానికి స్థలశుద్ధి

Satyam NEWS

పారదర్శకతకు పాతర: జీవోలు ఇకపై ఆన్ లైన్ లో ఉండవు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!