32.7 C
Hyderabad
March 29, 2024 12: 24 PM
Slider సంపాదకీయం

జగన్ ప్రచారానికి చెక్ పెట్టిన తెలుగుదేశం మహానాడు

#mahashakthi

తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆపేస్తుందన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. తాము అధికారంలోకి వస్తే జగన్‌ కన్నా ఎక్కువ సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తామని ఆయన మహానాడులో తేల్చి చెప్పారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ కు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా గట్టి షాక్‌ ఇచ్చినట్లయింది. ఎన్నికలకు ఏడాది ముందే చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పై వైసీపీ నేతల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతున్నది. పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీ అంటూ జగన్ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా శ్రీకారం చుట్టింది. టిడిపి అధికారంలోకి వస్తే 18 నుండి 59ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1500/`లు ఇస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రతి మహిళకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇస్తామని తెలిపారు.

ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3000/` వరుకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి ఒక్కరికీ రూ.15వేలు ఇస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇది వర్తిస్తుందని తెలిపారు. రైతులకు ప్రతి ఏడా ఒకేసారి రూ.20వేలు ఇస్తామని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన హామీల అమలుకు రూ.50 వేల కోట్లు అవసరం అవుతాయని, ఇది సమకూర్చుకోవడం పెద్ద కష్టమైన పని కాదని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా జరుగుతున్న అవినీతిని, అధికారంలో ఉన్న వారి దోపిడిని అరికడితే రూ.50 వేల కోట్లు సమకూర్చుకోవడం కష్టం కాదని కూడా వారు అంటున్నారు. ఆచరణ యోగ్యమైన సంక్షేమ పథకాలను చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టబోతున్నారని వారు అంటున్నారు.   

Related posts

మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

Satyam NEWS

నేరాలలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ

Satyam NEWS

సత్యం న్యూస్: క్షీరసాగర మథనం చిత్ర సమీక్ష

Satyam NEWS

Leave a Comment