ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. అప్సా మాజీ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ, మాజీ కార్యదర్శి గొలిమి రామకృష్ణ మద్దతుతో పోటీ చేసిన 11మంది అభ్యర్థుల్లో 10 మంది ఘన విజయం సాధించారు. ఒకరు స్వతంత్రంగా గెలుపొందారు. ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. 11 డైరెక్టర్ పదవుల కోసం 28మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 1,058 మంది ఓటర్లు ఉండగా 937 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన డైరెక్టర్లు క్యాంటీన్ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మురళీకృష్ణ, రామకృష్ణ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో సచివాలయంలో ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు.
previous post