కాకినాడ పోర్టును మాజీ సీఎం జగన్ రెడ్డి నేతృత్వంలో బలవంతంగా లాక్కున్నారని ఆరోపణలు ఉన్న కేసులో జగన్ రెడ్డి సోదరుడు, వైవీ సుబ్బారెడ్డి కొడుకు వైవీ విక్రాంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్టును ఆపాలంటూ విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని విక్రాంత్ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అయితే వారి అభ్యర్ధనను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు. కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఐడీకి ఆదేశం ఇచ్చారు. అయితే తమ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విక్రాంత్ న్యాయవాదులు కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. విచారణను వారానికి హైకోర్టు వాయిదా వేసింది.
previous post