33.2 C
Hyderabad
June 20, 2024 20: 21 PM
Slider సినిమా

మన బిగ్ బాస్ నాగార్జున అంటే మజాకానా?

bigboss nag

బిగ్‌బాస్‌కు సభ్యులు ఎదురు తిరగడంతో విమర్శల పాలైన కార్యక్రమాన్ని ఒక దారిలో పెట్టడానికి  చాలా కోపంగా కార్యక్రమానికి వచ్చారు హోస్ట్‌ నాగార్జున. మోడల్స్‌ సాంగ్స్‌తో ఎప్పుడూ ఎంట్రీ ఇచ్చే నాగార్జున నేటి ఎపిసోడ్‌లో అందరికీ షాక్‌ ఇచ్చారు. నేను చాలా సీరియస్‌గా ఉన్నా కంటెస్టెంట్స్‌పై పీకల వరకూ ఉంది. వాళ్లతో చాలా మాట్లాడాలి అంటూ బిగ్‌ బాస్‌ హౌస్‌ని మన టీవీ ద్వారా షాకింగ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యుల్ని చూసి షాకింగ్‌ లుక్‌ ఇచ్చిన నాగార్జున తన షూ పాలిష్‌ చేసుకుంటూ క్లాస్‌ పీకడం మొదలుపెట్టారు.

ఆయన షూ పాలిష్‌ చేస్తుంటే బిత్తరపోయి చూశారు.. షూ పాలిష్‌ చేయడాన్ని హేళన చేసిన పునర్నవి, మహేష్‌లు. ‘నా షూని నేను రోజూ పాలిష్‌ చేసుకోను. కాని నేను ఈరోజు పాలిష్‌ ఎందుకు చేస్తున్నా అంటే.. ఏ పని చిన్నది కాదు అని చెప్పడానికి. చేసే పనిని బట్టి మనిషి స్థాయి తగ్గడం పెరగడం ఉండదు. చేసే తీరుని బట్టే ఉంటుంది. మొదట్లో పునర్నవి హౌస్‌ నుండి ఎలిమినేట్‌ అవుతుంది అంటూ ఆటపట్టించాడు వరుణ్‌. నాకేం బాధలేదు పోతే పోతా అంటూ బదులిచ్చింది పునర్నవి.

ఇక ఎలిమినేషన్‌లో ఉన్న శిల్పా చక్రవర్తి.. రవి వద్ద ఫీల్‌ అయ్యింది. అందరితో కలిసిపోదాం అని వస్తే తనను సెపరేట్‌ చేసి చూస్తున్నారని బాధ పడింది. టాస్క్‌లో భాగంగా శ్రీముఖి వేలు సరదాగా కొరికి హగ్‌ చేసుకున్నందుకు తెగ ఫీల్‌ అయ్యిందని వాళ్ల కంటే నేను వయసులో పెద్ద పైగా తను అమ్మాయే కదా అని హగ్‌ చేసుకుంటే తప్పా ఇంట్లో మీరు మీరు రోజుకి పది సార్లు హగ్‌ చేసుకుంటున్నారు నేను హగ్‌ చేసుకుంటే తప్పా అంటూ వాపోయింది శిల్పా.

అన్ని సీజన్ల మాదిరిగానే బిగ్‌ బాస్‌ షోకి స్పాన్సర్స్‌గా ఉన్న రెనో రైబర్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు కంటెస్టెంట్స్‌తో యాడ్‌ని డిజైన్‌ చేశారు. దీనిలో భాగంగా రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్స్‌ కార్‌ యాడ్‌ చేయడం కోసం పోటీ పడ్డారు. బిగ్‌ బాస్‌ ఇన్విటేషన్‌ మీదే వచ్చాను అన్నావు. ఏంటి ఈ చెత్త పనులు షూ పాలిష్‌ చేయడం, డ్రాయర్‌లు ఉతకడం అంటూ ఏదేదో మాట్లాడావు. మాకు ఇవన్నీ అవసరమా? అంటున్నావ్‌. నువ్‌ ఏమీ ఇక్కడ ఇరగదీయడం లేదు. ఇన్విటేషన్‌ మీద వచ్చావా? నీ ఇన్విటేషన్‌ క్యాన్సిల్‌ చేస్తున్నా.. బిగ్‌ బాస్‌ డోర్లు తెరుస్తున్నా నువ్‌ ఇప్పుడే వెళిపోవచ్చు. డిసిషన్‌ తీసే ఉంది ఇప్పుడు వెళిపో. నువ్‌ కన్వెన్స్‌ అయ్యి టాస్క్‌ చేసినందుకు మాత్రమే నిన్ను బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉంచుతున్నాం’ అంటూ నాగార్జున గట్టి క్లాస్‌ పీకారు మహేష్‌కి.

శ్రీముఖి బిగ్‌ బాస్‌ హౌస్‌కి బిగ్‌ బాస్‌ ఎవరు? బిగ్‌ బాసే కదా కాని నీ ఆట ఎలా ఉందో తెలుసా? కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు ఉంది. నువ్‌ వచ్చింది ఆట ఆడటానికి తప్ప ఆడించేందుకు కాదు. నువ్‌ బిగ్‌ బాస్‌వి కాదు. నీకు గేమ్‌ ఆడటం ఇష్టం లేకపోతే పక్కకి తప్పుకో దయచేసి మ్యానుప్యులేట్‌ చేయకు. గేమ్‌ ఆపడానికి లీడ్‌ చేయకు’ అంటూ శ్రీముఖి కంటెస్టెంట్స్‌ని ఎలా మ్యానుప్యులేట్‌ చేస్తుంటే వీడియోను ప్లే చేసి మరీ క్లాస్‌ పీకారు నాగార్జున. బాస్‌ హౌస్‌లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు.. బిగ్‌ కంటెస్టెంట్స్‌లో స్పూర్తి నింపేందుకు వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర స ష్టించిన తెలుగు తేజం పీవీ సింధును బిగ్‌ బాస్‌ స్టేజ్‌ మీదికి తీసుకువచ్చారు నాగార్జున.

బ్యాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డుల్లోకెక్కిన సింధూ తన గురువు గోపీచంద్‌తో కలిసి బిగ్‌ బాస్‌కి వచ్చారు. పీవీ సింధు, గోపీచంద్‌లను చూసి షాక్‌ అయ్యారు కంటెస్టెంట్స్‌. సింధు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయాన్ని కంటెస్టెంట్స్‌కి తెలియజేశారు నాగార్జున. ఇక కంటెస్టెంట్స్‌తో సరదాగా ముచ్చటించారు సింధు.

నాకు హౌస్‌లో అందరూ ఇష్టమే అన్నారు. రాహుల్‌ పాట పాడితే.. బాబా భాస్కర్‌ డాన్స్‌ చేయడం చూడాలని ఉందటంతో బాబా ఆటతో.. రాహుల్‌ ఆటతో బిగ్‌ బాస్‌ హౌస్‌ని హోరెత్తించారు. అనంతరం మహనటి అంతకు మించి అనే టాస్క్‌ ఏర్పాటు చేసి సభ్యుల మనసులో ఒకరిపై మరోకరికి ఉన్న అభిప్రాయాలను తెలుసుకున్నారు.

చివరికి ఎలిమినేషన్‌ నుండి హిమజను సేఫ్‌ చేశారు.హిమజ ఈ వారం సభ్యులందరి కంటే అధికంగా ఓట్లు గెలుచుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి హౌజ్‌ ను ఒక గాడీలో పెట్టిన అనే సంతృప్తితో నాగార్జున అధివారం కలుస్తానంటు వెళ్లిపోయాడు.

Related posts

కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కాలం ముగిసినట్లేనా?

Satyam NEWS

హోంగార్డ్స్ ఆదర్శంగా నిలవాలి

Murali Krishna

బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment