28.7 C
Hyderabad
April 20, 2024 04: 17 AM
Slider సినిమా

సారీ బిగ్ బాస్ అంతా తూచ్

Big boss 34

అరెరె.. ఆట కాస్త స్లో అయ్యేటప్పటికి బిగ్ బాస్‌కి ఎలా ఫిటింగ్ పెట్టాలో బాగా తెలుసు. సో.. గత రెండు రోజులుగా ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’ అనే టాస్క్‌తో ఇంటి సభ్యుల మధ్య ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్.. పునర్నవి, శ్రీముఖి,మహేష్, లకు షూ పాలిష్ చేయాలని శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే మేం గతి లేక ఇక్కడకు వచ్చామా? లేక సిల్లీ గేమ్‌లు పెట్టి.. బుద్ధి లేకుండా బుల్ షిట్ గేమ్స్ ఇస్తే మేం చేయాలా? మేం చేయము ఏం చేస్తారో చేసుకోండి అంటూ రచ్చ చేసిన పునర్నవి నేటి ఎపిసోడ్‌లో కాంప్రమైజ్ అయ్యింది.

గత రెండు రోజులుగా బిగ్ బాస్‌పై తిరుగుబాటు డ్రామా ప్లే చేసి రచ్చ చేస్తున్న పునర్నవి.. నేటి ఎపిసోడ్‌లో స్క్రిప్ట్ ప్రకారం వెనక్కి తగ్గి షూ పాలిష్ చేసింది. నిన్న, మొన్నటి ఎపిసోడ్‌లలో క్యారెక్టర్, మనోభావాలు అదీ ఇదీ అంటూ పెద్ద క్లాస్‌లు పీకిన పునర్నవి.. సారీ బిగ్ బాస్ అంతా తూచ్ అనేసింది. షూ పాలిష్ చేయడంలో ఎంతో అనుభవం ఉన్నట్టుగా షూ పాలిష్ చేసింది. నిన్న ఛీ.. షూ పాలిష్‌నా అన్న పునర్నవి స్వీట్లు తిన్నంత ఈజీగా పాలిష్ చేసి ఇంటి సభ్యులతో చప్పట్లు కొట్టించుకుని కాలర్ ఎగరేసింది.

‘సారీ.. బిగ్ బాస్ నేను ఏవైనా ఎక్కువ తక్కువలు మాట్లాడితే క్షమించండి. నాకు టాస్క్ నచ్చకపోవడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది’ అంటూ బిగ్ బాస్‌తో వివాదానికి ముగింపు పలికింది పునర్నవి. చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్.. శెభాష్ పునర్నవి!! నువ్ ఎన్ని తిట్టినా నాకు సిగ్గేలేదు అన్నట్టుగా ఆమెను ప్రశంసిస్తూ పునర్నవితో పాటు మహేష్, శ్రీముఖిలకు సైతం లగ్జరీ బడ్జెట్‌ను బోనస్‌గా ఇచ్చారు. తనకు పెట్టకుండా గడ్లు, బంగాళదుంపలు కర్రీ చేసుకుని తింటున్న బాబా భాస్కర్, శ్రీముఖి, రవి, వరుణ్, శిల్ప మిగిలిన సభ్యులపై అలిగి తినడం మానేసింది హిమజ.

నాకు చెప్పకుండా కనీసం తింటావా అని అడగకుండా ఎవరికి వచ్చినట్టు వాళ్లు వండుకుని తింటున్నారు. నేనూ వండుకోలేకనా? అంటూ బుంగ మూతి పెట్టింది హిమజ. ఇక సీన్‌లోకి వచ్చిన శివజ్యోతి ఏడ్వకుండానే హిమజకు సర్దిచెప్పే ప్రయత్నం కష్టం మీద చేసింది. ఈ వారం హౌస్‌కి కెప్టెన్ అయ్యేందుకు ‘బరువు లెత్తగలవా జెండా పాతగలవా’.. అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌ కాని వారికి ఛాన్స్ ఇచ్చారు.

దీని ప్రకారం శ్రీముఖి, పునర్నవిలు కెప్టెన్ అయ్యేందుకు ఆసక్తి చూపించకపోవడంతో.. మహేష్, వితికా, రవిలు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడ్డారు. ఈ టాస్క్ ప్రకారం.. కెప్టెన్ కావాలనుకున్న వాళ్లు.. వాళ్లకు నచ్చిన వాళ్ల వీపుపై ఎక్కి తమకు ఇచ్చిన జెండాలను ఒక ప్లేస్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఇలా జోడీగా ఆడిన ఆటలో ఎవరు ఎక్కువ జెండాలు పెడితే వాళ్లే బిగ్ బాస్ కొత్త కెప్టెన్ అని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక కెప్టెన్ అయ్యేందుకు వితికా తన భర్త వరుణ్ వీపుపై.. శ్రీముఖి-రవి వీపుపై.. శివజ్యోతి- మహేష్ వీపుపై ఎక్కి గేమ్ ఆడారు.

అయితే వితికా.. వరుణ్ వీపుపై ఎక్కి ఎక్కువ జెండాలు పెట్టడంతో ఆమె ఈవారం కెప్టెన్‌గా ఎంపికైంది. ఇక తాను కెప్టెన్ కాగానే ప్రపంచాన్ని జయించినట్టుగా.. తనను ఎత్తుకుని కెప్టెన్‌ని చేసిన వరుణ్‌ని ముద్దులతో ముంచెత్తింది. తనతో పాటు గేమ్ ఆడిన ఇంటి సభ్యుల్ని హేళన చేస్తూ చిందులేసింది. కెప్టెన్ కావడం కాదు.. ముందు కెప్టెన్‌గా బిహేవ్ చేయి అని వరుణ్ వారించినా.. వితికాకు పునర్నవి తోడు కావడంతో ఆనందంతో తెగపొంగిపోయారు.

ఈ జీవితానికి ఇది చాలు.. సీజన్ 3లో వితికా కెప్టెన్ అయ్యింది అంటూ ఇంటి సభ్యులందరికీ హగ్‌లు ఇస్తూ కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా కెప్టెన్ కాగానే రచ్చ రచ్చ చేసింది వితికా.

Related posts

శాల్యూట్: వీరే మనకు కనిపించే దేవుళ్లు

Satyam NEWS

కొనసాగుతున్న భారీ వర్ష సూచన

Satyam NEWS

Attention: నిరాశ వద్దు సోదరా కరోనా చచ్చేరోజు ఉంది

Satyam NEWS

Leave a Comment