బిగ్ బాస్-3 రియాల్టీ షోలో మరో వీకెండ్ వచ్చేసింది. మూడో సీజన్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన శైలికి భిన్నంగా సీరియస్ టోన్ వినిపించడం లేటెస్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఈ వారంలో బిగ్ బాస్ ఇంట్లో జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకుని నాగ్ ముఖ్యంగా పునర్నవి, శ్రీముఖిలకు క్లాస్ తీసుకున్నట్టు తాజా ప్రోమో వెల్లడిస్తోంది. నెవర్ గివప్, నెవర్ గివప్ అంటావు కదా, మరి నువ్వెందుకు ఓటమిని అంగీకరించావు? అంటూ పునర్నవిని నిలదీశాడు. అంతేగాకుండా, టాస్క్ లో భాగంగా ఇచ్చిన గేమ్ ను ** గేమ్ అంటావా?… అవేనా నువ్వు మాట్లాడాల్సిన మాటలు! అంటూ ఫైరయ్యాడు. ఇక శ్రీముఖిపైనా నాగ్ విరుచుకుపడ్డాడు. ఈ హౌస్ కు నువ్వు కాదు బాస్… బిగ్ బాసే ఈ హౌస్ కు అసలైన బాస్ అంటూ స్పష్టం చేశాడు. నీ గేమ్ చూస్తుంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుగా ఉందంటూ నిర్మొహమాటంగా విమర్శించాడు. ఓవైపు శ్రీముఖి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా నాగ్ ఆమెను మాట్లాడనివ్వలేదు. గత ఎపిసోడ్ లకు భిన్నంగా ఈ వీకెండ్ ఎపిసోడ్ వాడీవేడిగా సాగుతుందని ప్రోమో చెబుతోంది.
previous post