స్టార్ మా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 లో వైల్డ్ కార్డుతో ఎంట్రీతో అడుగు పెట్టిన యాంకర్ శిల్ప చక్రవర్తి ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ యాంకర్ కు ఎవరి నుంచీ కూడా మద్దతు లభించడం లేదు. ఈ మేరకు ఈ విషయాన్ని నాగార్జున కు చెప్పుకుని శిల్ప బాధపడింది. ఇదే సాకుగా చూపి అమెను మిగతా సభ్యులు ఈ వారం ఎలిమినేట్ చేశారు. ప్రతి సోమవారం జరిగినట్లే ఈ సోమవారం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ కోసం నామినేట్ పక్రియ జరిగింది.
అయితే ఈ సారి బిన్నంగా హౌస్ మేట్స్ ని రెండు గ్రూప్ లు డివైడ్ చేశారు. ఒక గ్రూప్ లో రాహుల్, వరుణ్, వితిక, పునర్నవి, శిల్ప చక్రవర్తి, మరో గ్రూప్ లో రవిక ష్ణ,శివజ్యోతి,శ్రీ ముఖి, హిమజ, మహేష్ ఉన్నారు. కెప్టెన్ కాబట్టి బాబా నామినేషన్స్ లో ఉండడు కాబట్టి అతన్ని సంచలకుడిగా ఉంచాడు. ఇక ఒక్కో గ్రూప్ లోని వాళ్ళు తమ అవతలి గ్రూప్ లోని ఇద్దరు సభ్యులను మాత్రమే నామినేట్ చేయాలి. ఈ క్రమంలో వాళ్ళ ఫోటోలు తీసుకోని వెళ్లి మంటల్లో వేసి కాల్చి , బూడిద తీసుకొనివెళ్ళి వాళ్ళకి బొట్టుపెట్టాలి. ఈ నామినేషన్ లో రవికృష్ణ గ్రూప్ నుండి నలుగురు అయ్యారు. ఒక్క శివజ్యోతి తప్ప మిగిలిన రవి,మహేష్,హిమజ, శ్రీముఖి అయ్యారు.
వరుణ్ గ్రూప్ లో పునర్నవి,శిల్ప అయ్యారు. ఇక కెప్టెన్ కి స్పెషల్ పర్మిషన్ ఇస్తూ నామినేట్ అయిన వాళ్ళ నుండి ఒకరిని సేవ్ చేయమని బిగ్ బాస్ చెప్పటంతో రవిక ష్ణని బాబా భాస్కర్ సేవ్ చేశాడు. దీనితో ఈ వారం ఎలిమినేషన్ లో శ్రీముఖి, హిమజ, పునర్నవి, శిల్ప, మహేష్ ఉన్నారు. కాగా సోమవారం రాత్రి నుండే ఎలిమినేషన్ ప్రక్రియలో సేప్ చేయడానికి ఓటింగ్ ప్రారంభం కాగా ఓటింగ్‌లో శిల్ప చక్రవర్తి బాగా వెనుకబడి ఉంది.
పునర్నవి ఈవారం అందరికంటే ఎక్కువ ఓట్లు పొంది అగ్రస్థానంలో ఉండగా రెడవ స్థానంలో శ్రీముఖి, మూడో స్థానంలో మహేష్ నాలుగోవ స్థానంలో హిమజలు కొనసాగుతున్నారు. ఈ అదివారం ఎలిమినేట్ అయ్యె చాన్స్‌లు అధికంగా శిల్పకు ఉంది. కాగా శిల్ప గత వారమే హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా బాబా భాస్కర్ అమెను ఒకటి రెండు వారాల్లో నువ్వు వెళ్లిపోతావని చెప్పగా అమె భాదపడింది. శిల్ప ఎలిమినేషన్ అయితే భాస్కర్ జోస్యం నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి.