35.2 C
Hyderabad
April 20, 2024 15: 37 PM
Slider కర్నూలు

కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

#fireaccident

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుందరయ్య పార్క్ లో నిల్వ ఉంచిన త్రాగు నీటి నల్ల పైపు లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలనీ లో పైపు లైన్ వేసేందుకు పార్క్ లో పైపు లను మున్సిపల్ సిబ్బంది నిల్వ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్యెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. ఈ సంఘటన ఎలా జరిగిందో విచారణ చేయాలని, తప్పు చేసిన వారెవ్వరైనా సరే వదలి పెట్టకూడదని డిఎస్పీ ని, నాలుగవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. పాణ్యం ఎమ్యెల్యే తో పాటు కోడుమూరు ఎమ్యెల్యే జె.సుధాకర్ బాబు, కర్నూలు నగర మునిసిపల్ కమీషనర్ డీకే.బాలాజీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెరనేకల్ సురేందర్ రెడ్డి, పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.

Related posts

రామన్నకు యాంకర్ అనసూయ క్షమాపణ

Satyam NEWS

శ్రీశైల మహాక్షేత్రంలో స్వామివారి స్పర్శ దర్శనం

Satyam NEWS

నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి

Satyam NEWS

Leave a Comment