40.2 C
Hyderabad
April 24, 2024 16: 36 PM
Slider సంపాదకీయం

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్: దళిత బంధు ఎరకు చిక్కిన మల్లు?

#mallubhatti

కాంగ్రెస్ పార్టీకి త్వరలో పెద్ద షాక్ తగలబోతున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క త్వరలో పార్టీ వీడనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ఆయన త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా తెలిసింది. దళిత బంధు ను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కగా అమలు చేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క గత కొద్ది రోజులుగా ఆయనను విపరీతంగా పొగుడుతున్నారు.

మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజవర్గంలోని చింతకాని పల్లెలో దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా దళిత బంధును హుజూరాబాద్ లో అమలు చేస్తున్నారు.

అయితే ఇంతటితో ఆగకుండా రాష్ట్రం మొత్తంలో మరి కొన్ని నియోజకవర్గాలలోని ఒక్కో మండలంలో కూడా దళిత బంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయన సూచన మేరకు చింతకాని పల్లె మండలంలో దళిత బంధు సర్వే పూర్తి అయింది.

ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయడంపై అప్పటిలోనే కొందరు ఆశ్చర్య పోయారు కానీ ఆ తర్వాత వేగంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేస్తున్నారో, దళిత బంధును మల్లు భట్టి విక్రమార్క ఎందుకు ఆకాశానికి ఎత్తుతున్నారో అర్ధం అయింది.

అయతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ఈ పరిణామాలను తేలికగానే తీసుకుంటున్నది. డి కె అరుణ, సబితా ఇంద్రారెడ్డి లాంటి బలమైన నాయకులే కాంగ్రెస్ పార్టీని వీడివెళ్లారు. ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లినా వారిని ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

పార్టీకి విధేయతగా ఉన్నవారితోనే పార్టీని నడపండి అంటూ రాహుల్ గాంధీ నుంచి క్లియర్ మెసేజి వచ్చింది. ఈ కారణంగానే పార్టీ నుంచి వెళ్లిపోయేవారిని ఎట్టిపరిస్థిత్లులో ఆపేదిలేదని రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ నుంచి వెళ్లకుండా చీకాకు పరిచే కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారిపై చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి అడ్డు చెప్పదు. అందువల్ల భట్టిని పార్టీలో కొనసాగేలా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ లో ఎవరూ ప్రయత్నం కూడా చేయడం లేదు.

Related posts

ఆళ్లగడ్డ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Satyam NEWS

సంగీత నిలయం కోసం నిధుల సేకరణ కై బ్రోచర్ విడుదల

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ

Satyam NEWS

Leave a Comment