28.2 C
Hyderabad
April 20, 2024 14: 54 PM
Slider విజయనగరం

పెద్ద పెద్ద షాపుల‌పై రెవిన్యూ,పోలీసులు యంత్రాంగం దృష్టి

#VijayanagaramCity

రాష్ట్ర మంతటా క‌రోనా కేసులు తెగ పెరుగుతున్న వేళ ఉన్న ప‌ని వేళ‌ల‌ను అనూహ్యంగా జిల్లా కలెక్ట‌ర్…ఉన్న‌తాద‌దికారుల ఆదేశాల మేర‌కు కుదించారు. దీంతో  ఉద‌యం 6 నుంచీ 12 గంట‌ల వ‌ర‌కు బ‌దులు..8 నుంచీ 11.30 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే క‌ర్ఫ్యూ స‌డ‌లింపున‌కు అనుమ‌తి ఇచ్చారు.

ఈ మేర‌కు  జిల్లా కేంద్రంలో కుదించిన ప‌ని  వేళ‌లను వ్యాపార‌స్థులు, ప‌లు షాపుల య‌జ‌మానులు పాటిస్తున్నారో లేదోన‌ని రెవిన్యూ డీవిజ‌నల్ అదికారి భ‌వానీ శంక‌ర్, డీఎస్పీ అనిల్ లు ద‌గ్గ‌రుండీ ప‌రిశీలించారు. 

ఈ నేప‌ధ్యంలో న‌గ‌రంలోని ఎన్సీఎస్ థియేట‌ర్ వ‌ద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ నుంచీ గంట‌స్తంభం వ‌ర‌క  మాడు ప‌గుల గొట్టే ఎండ వేళ‌…ఆర్డీఓ ,డీఎస్పీలు షాపులను ద‌గ్గ‌రుండీ మూయించారు. ప్ర‌దానంగా ఎంజీ రోడ్డులోనే పెద్ద పెద్ద బంగారం  షోరూమ్ లైన‌ ల‌లితా జ్యూయెల్ల‌రీస్,ధ‌న‌లక్ష్మీ జ్యూయ‌లెరిస్, అలాగే పెద్ద పెద్ద బ‌ట్ట‌ల షోరూములైన ట్విల్స్,సియారామ్, వంటి షో రూమ్  ల‌లో  నిర్ణీత స‌మ‌యం కుదించిన సంగ‌తి చెప్పి మ‌రీ…షాపుల‌ను మూయించారు.

కొన్ని కొన్ని షో రూమ్ ల‌లో అయితే ముందు పెద్ద పెద్ద షట్ట‌ర్ల‌ను క్లోజ్ చేసినా…లోప‌ల వినియోగ‌దారులు ఉన్నార‌న్న సంగ‌తి  తెలుసుకున్న డీఎస్పీ అనిల్, ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్ లు  ద‌గ్గ‌రుండీ మూసిన షో రూమ్ ల డోర్ ల‌ను తీయించి మరీ లోప‌ల య‌జ‌మానుల‌ను గ‌ట్టిగా మంద‌లించి..క‌రోన తీవ్ర‌త, దాని ప్ర‌భావాన్నితేలిక‌గా తీసుకుంటున్నార‌ని మీ ప్రాణాల  కోస‌మే క‌ర్ఫ్యూస‌డ‌లింపు స‌మ‌యాన్ని కుదించిన‌ట్టు ఇద్ద‌రు అధికారులు చెప్పారు.

ఒక షాపులో స్వ‌యంగా సేల్స్ సిబ్బంది.అటు ఆర్డీఓ ఇటు డీఎస్పీ క్లాస్ లు తీసుకున్నారు. అంత‌కుముందే న‌గ‌రంలోకి డీఎస్పీ,ఆర్డీఓ త‌నిఖీల‌కు వ‌స్తున్నార‌ని న‌గ‌ర వ‌న్ సీఐ ముర‌ళీకి తెలియ‌డంతో.. ఆ విష‌యాన్ని త‌న స్టేష‌న్ ఎస్ఐలు, దేవీ, కిర‌ణ్ ల‌కు చెప్పారు.

అదే స‌మయంలో రూర‌ల్ సీఐ మంగ‌వేణికి కూడా తెలియ‌డంతో స‌రిగ్గా ఎంజీ రోడ్డు ఆంజ‌నేయ స్వామి టెంపుల్ వ‌ద్ద తొలుత డీఎస్పీ అనిల్,సీఐ మంగ‌వేణిలు రాగా అనంత‌రం వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ,దేవీలు వ‌చ్చారు.ఆవెంట‌నే ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్ రావ‌డంతో అంతా క‌రోనా యాక్ష‌న్ టీమ్ గా ఏర్ప‌డి…న‌డుచ‌కుంటూ అన్ని షాపుల‌ల య‌జ‌మానుల‌కు ఎందుకు క‌ర్ఫ్యూ స‌డ‌లింపును కుదించామో తెలియ ప‌రిచి ద‌గ్గ‌రుండీ షాపుల‌ను ద‌గ్గ‌రుండీ మూయించారు.

Related posts

భూ ఆక్ర‌మ‌ణ‌లపై అధికారుల చోద్యం

Sub Editor

భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం

Bhavani

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇక మహర్దశ

Satyam NEWS

Leave a Comment