ఉత్కంఠభరితంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. పాలక బీజేపీ విపక్ష జేఎంఎం, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం జేఎంఎం కాంగ్రెస్ కూటమి 32 స్ధానాల్లో ముందంజలో ఉండగా పాలక బీజేపీ 34 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
ఏజేఎస్‌యూ 7 స్ధానాల్లో, జేవీఎం 3 స్ధానాల్లో, ఇతరులు 3 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్ధానాలు కలిగిన జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 42. ఫలితాల్లో బీజేపీ, జేఎంఎంల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగుతోంది.