27.7 C
Hyderabad
April 26, 2024 05: 08 AM
Slider ప్రత్యేకం

దేశ చరిత్రలోనే ఘోర రైలు ప్రమాదాలు..

1981లో బిహార్‌లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది వరకు మరణించారు.

1995లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌ కలిండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొన్న ఘటనలో 358 మంది చనిపోయారు.

1999లో అసోంలోని గైసోల్‌ వద్ద జరిగిన రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో 290 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించింది.

1998లో కోల్‌కతా వెళుతున్న జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ ఖన్నా-లుఽథియానా సెక్షన్‌లో పట్టాలు తప్పిన గోల్డెన్‌ టెంపుల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలను ఢీకొట్టడంతో 212 మంది ప్రాణాలు కోల్పోయారు

2002లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 140 మంది వరకు చనిపోయారు.

2010లో హౌరా నుంచి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్‌ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలు పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొట్టిన ఘటనలో 170 మంది దాకా చనిపోయారు.

2016లో ఇండోర్‌ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌ సమీపంలో పట్టాలు తప్పిన ప్రమాదంలో 150 మంది వరకు చనిపోయారు.

2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు వంతెన కొట్టుకుపోవడంతో ఓ డెల్టా పాసింజర్‌ రైలు పట్టాలు తప్పి 114 మంది దుర్మరణం చెందారు.

Related posts

రాజంపేట లో వైసీపీ రైతు దగా దినోత్సవం…

Satyam NEWS

కరోనా వైరస్ నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తాం

Satyam NEWS

ఇసుక ఎక్కువ రేటు చెబితే ఒక్క ఫోన్ చేయండి చాలు

Satyam NEWS

Leave a Comment