28.7 C
Hyderabad
April 20, 2024 10: 07 AM
Slider తెలంగాణ

రైతు పురోభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం

niranjan reddy

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అధ్యయనం చేసేందుకు బీహార్ నుంచి వ్యవసాయ శాఖ బృందం వచ్చింది. మూడు రోజుల పాటు తెలంగాణాలో పర్యటించనున్న ఈ బృందం తెలంగాణ విత్తన పరిశ్రమలను, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లను, విత్తనోత్పత్తి క్షేత్రాలను, విత్తన పరీక్ష ల్యాబ్ లను కూడ సందర్శించనుంది. ఆ బృందాన్ని ఉద్దేశించి తెలంగాణ  వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం ధాని అనుబంధ రంగాల అభివృద్ధికి ఏ రాష్ట్రం కేటాయించని బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించి వ్యవసాయ రంగం లో నూతన సంస్కరణలు తీసుకవచ్చామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ఎంతో పురోగతి సంధించి దేశం లోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా సిఎం కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. రైతన్ను ఆదుకోవడానికి రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, ఋణ మాఫీ, త్వరిత గతిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం విత్తన రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో హైదరబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో బండమైలారం గ్రామంలో 150 ఎకరాలలో విత్తన పరిశోదన సంస్థలు, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు, అధునాతన విత్తన పరీక్ష ల్యాబ్ లు, శీతల గిడ్డoగులు, గోదాములు, ట్రైనింగ్ సెంటర్లు ఉండే విధంగా సీడ్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, ఇప్పటికే దానికి సంబంధించిన భూ కేటాయింపులు కూడా పూర్తవుతునాయని తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి, డా. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ క్రొత్తగా ఏర్పడిన తెలంగాణ రాస్త్రం రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగా అభివృద్దికి తీసుకుంటున్న చర్యలను, పథకాలను అద్యయనం చేసి, “బీహార్ కృషి రోడ్ మ్యాప్” తయారు చేయడానికి తెలంగాణకు రావడం జరిగిందని, అదేవిధంగా బీహార్ విత్తన పరిశ్రమ అభివృద్ధికి కొత్త విత్తన పాలసేని తీసుకవస్తున్నామని, సూక్ష్మ నీటి పారుదల రంగం, విద్యుత్ రంగంలో కొత్త  సంస్కరణలు తెస్తున్నామని, దీనికి  తెలంగాణ ప్రభుత్వ సహకారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ని కోరారు.

Related posts

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

Bhavani

పిల్ల‌ల‌ను ప‌నుల్లోకి పెడితే క‌న్న‌వాళ్ల‌పై కేసు నమోదు

Satyam NEWS

గుడ్ బిగెనింగ్: నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ట్రయల్ రన్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment