మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ మళ్లీ వివాదాస్పదుడయ్యారు. ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే రేఖా దేవీపై ఆయన అనుచితంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతుండగా ఆమెను ఉద్దేశించి ‘మీరు మహిళ, మీకేం తెలియదు’ అని అన్నారు. బీహార్ అసెంబ్లీ లో విపక్షాల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. సహనం కోల్పోయిన సీఎం నీతీశ్ కుమార్ ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతుండగా ఆమెను ఉద్దేశించి ‘మీరు మహిళ, మీకేం తెలియదు’ అని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు సీఎం వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశాయి. నితీష్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరదీసినట్లు ఉంది. అయితే తాను చెప్పేది వినాలని, లేకపోతే తప్పు మీదేనని ప్రతిపక్షాలనుద్దేశించి నితీశ్ అన్నారు. మహిళల విషయంలో నితీశ్ తీరు మారదని RJD నేత తేజస్వీయాదవ్ దుయ్యబట్టారు.
previous post