30.7 C
Hyderabad
April 16, 2024 23: 52 PM
Slider జాతీయం

కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు

బిహార్‌లోని మధుబని జిల్లా ఝంజర్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు ఏకంగా జడ్జిపైనే దాడికి పాల్పడ్డారు. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (ASJ) విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసు అధికారులు అతడిపై దాడి చేశారు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఘోఘర్దిహ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గోపాల్ ప్రసాద్, సబ్-ఇన్‌స్పెక్టర్ అభిమన్యు కుమార్ ఇద్దరూ ఒక కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. వారు కోర్టు గదిలోకి ప్రవేశించినప్పుడు జడ్జి అవినాష్ కుమార్‌ తలపై తుపాకి గురిపెట్టి, దాడికి తెగబడ్డారు.

అంతేకాక న్యాయమూర్తిని రక్షించేందుకు జోక్యం చేసుకున్న పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని కూడా వారు విచక్షణ రహితంగా గాయపరిచారు. మీడియా కథనాల ప్రకారం న్యాయమూర్తి అవినాష్ కుమార్ తన తీర్పుల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచేవారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. చాలా సందర్భాల్లో పోలీస్‌ డిపార్ట్ మెంట్ ను హెచ్చరించారు.

Related posts

గులాబీ తుపాన్…ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ ఆదిత్యనాధ్ పర్యటన..!

Satyam NEWS

టిబి వ్యాధి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ఉపశమించిన గోదారమ్మ ఊపిరి పీల్చుకున్న రెవిన్యూ అధికారులు

Satyam NEWS

Leave a Comment