29.2 C
Hyderabad
September 10, 2024 17: 25 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ

#vikramsimhapuri

కాకుటూరు లోని  విక్రమ సింహపురి యూనివర్సిటీ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  సంయుక్తంగా యూనివర్సిటీ నందు హెల్మెట్ పై అవగాహనను కల్పించి బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు బైక్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులందరూ విధిగా హెల్మెట్ ధరించాలని తద్వారా వారి ప్రాణాలను కాపాడుకోగలరని తెలుపుతూ, హెల్మెట్ ధరిస్తే ప్రమాద సమయాల్లో హెల్మెట్ మనల్ని కాకుండా మన కుటుంబాలకు కూడా రక్షణ వలయంగా ఉండి మనలను కాపాడుతుందని అటువంటి హెల్మెట్ ను ప్రతి ఒక్కరు విధిగా బాధ్యతగా వాడాలని సూచించారు.

అలాగే యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ను ధరించే విధంగా ఒక సర్కులర్ ను జారీ చేయాలని విశ్వవిద్యాలయ సచివులు డాక్టర్ కె. సునీత ని ఆదేశించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సివిల్ జడ్జి  కే.వాణి బైక్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ హెల్మెట్ వాడకం ద్వారా దేశంలో అనేకమంది పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకొని తిరిగి వారు మంచి జీవితాన్ని సాగిస్తున్నారని అధ్యయనాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్ విభాగాన్ని  వారు అభినందించారు.

అనంతరం వారు బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ బైక్ ర్యాలీలో స్వయంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు విశ్వవిద్యాలయ సచివులు డాక్టర్ కే సునీత  హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ యూనివర్సిటీ నుండి కాకుటూరు గ్రామం మీదగా వెళ్లి జాతీయ రహదారి మీదుగా తిరిగి యూనివర్సిటీకి చేరుకుంది ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి.హెచ్ విజయ, ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి మహేందర్ రెడ్డి, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి.వి.సుబ్బారెడ్డి, ఎన్.ఎస్.ఎస్ నోడల్ ఆఫీసర్ నీలమణికంఠ వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

భాజపా జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఎండల లక్ష్మీనారాయణ

Satyam NEWS

దేశంలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Satyam NEWS

డాక్టర్ అనితా రెడ్డి కి ఉమెన్ ఎక్స్ లెన్సి -2023 అవార్డు

Satyam NEWS

Leave a Comment