30.7 C
Hyderabad
April 17, 2024 00: 49 AM
Slider జాతీయం

కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికైన ‘‘బికినీ భామ’’

#archanagowtham

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మీరట్ ప్రాంతంలోని హస్తినాపూర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అర్చన గౌతమ్ పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్నది.

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు 125 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా అందలో ఒకరిగా ఆమె పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ అర్చన పేరును ప్రకటించిందే తడవుగా అర్చన పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ లు ప్రారంభమయ్యాయి. ప్రియాంక గాంధీ ఆమె పేరును ప్రకటించిన దృష్ట్యా ఇద్దరి ఫొటోలను పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ అర్చన చేసిన పాపం ఏమిటి? ఏమీ లేదు ఆమె పేరు ‘‘బికినీ భామ’’. 2018లో ఆమె ‘మిస్ బికినీ’ గా ఎంపిక అయింది. 2014 లో మిస్ ఉత్తరప్రదేశ్  గా, 2018 లో & మిస్ కాస్మో వరల్డ్ గా కూడా ఆమె ఎంపిక అయింది. నటి-మోడల్ గా ప్రస్తుతం ఆమె పాపులర్ అయింది. అయితే ఆమె ప్రత్యర్థులు మాత్రం ఆమె బికినీ వేసుకుని ఉన్న ఫొటోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు.

ఆమె తాను ఎన్నికల్లో గెలిస్తే, ప్రధాన దృష్టి టూరిజం అభివృద్ధి పనులు పై పెడతానని ఆమె అంటున్నది. ‘హస్తినాపురం పర్యాటక ప్రదేశం, ఇక్కడ చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి కానీ కనెక్టివిటీ సమస్య కారణంగా ప్రజలు రాలేకపోతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ నిర్మించడమే నా ప్రాధాన్యత. టూరిజం పుంజుకుంటే ఎక్కువ మంది టూరిస్టులు వచ్చి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది’ అని అర్చన అన్నారు.

Related posts

కొత్త ఏడాది లో తొలి రోజునే విద్యల నగరంలో కొత్తగా ట్రాఫిక్ ఇక్కట్లు…!

Satyam NEWS

జగన్ జిల్లా పర్యటన వల్ల ఒరిగింది ఏమీ లేదు

Bhavani

సుప‌రిపాల‌న ఏంటో చూపిన మ‌హానేత‌ అట‌ల్ బిహారీ వాజ్ పేయి

Satyam NEWS

Leave a Comment