27.7 C
Hyderabad
March 29, 2024 02: 20 AM
Slider సినిమా

పాజిటీవ్ టాక్ తో కల్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్రం

#bimbisara

సోషల్ ఫాంటసీ మూవీ ‘బింబిసార’కు తొలి షో నుంచే హిట్ టాక్ వచ్చింది. సినిమా అదిరింది అంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటన ఒక రేంజ్ లో ఉందని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెపుతున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక విజువల్ వండర్ అని అంటున్నారు

కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలకు సినీ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. యంగ్ డైరెక్టర్ వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా… ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.

Related posts

కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి

Bhavani

జగన్ రాజకీయ చిత్రానికి సెన్సార్ కత్తెరలు

Satyam NEWS

సీఎం కేసీఆర్ కు అందరూ రుణపడి ఉండాలి

Satyam NEWS

Leave a Comment