27.7 C
Hyderabad
April 20, 2024 00: 30 AM
Slider ఖమ్మం

బయోమెట్రిక్ తప్పనిసరి

#collector

విద్యా శాఖలో బయోమెట్రిక్ హాజరు అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులతో బయోమెట్రిక్ హాజరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, సాంఘీక సంక్షేమ శాఖల వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టినట్లు అట్టి దానిని వంద శాతం అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులు సమస్యలు గుర్తించి, అన్నిచోట్లా హాజరు బయోమెట్రిక్ లో నమోదు అయ్యేలా చూడాలని, ట్రెజరీ అధికారులకు బయోమెట్రిక్ హాజరుతో బిల్లుల స్క్రూటిని చేసేలా సూచనలు చేయాలని ఆయన తెలిపారు. విద్యా శాఖలో బయోమెట్రిక్ హాజరు అమలుకు ఉద్దేశించిన జిల్లాల జాబితాలో ఖమ్మం జిల్లాను చేర్చుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరుకు ఉన్న పరికరాల పరిస్థితిని చూసి, వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు. బిసి సంక్షేమ వసతి గృహాల్లో కరోనాకు పూర్వం ఉన్న బయోమెట్రిక్ హాజరు పరిస్థితిని పరిశీలించాలన్నారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, డిడి సాంఘీక సంక్షేమం సత్యనారాయణ, జిల్లా గిరిజనాభివృద్ది అధికారి కృష్ణా నాయక్, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి రవి బాబు, ఇడిఎమ్ దుర్గాప్రసాద్, టీఎస్ టీఎస్ ప్రతినిధులు అభిషేక్, పవన్ కుమార్, భానుతేజ, ప్రహ్లాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నో సెక్యూలర్:ఢిల్లీ ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారు

Satyam NEWS

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

Bhavani

హైదరాబాద్ పోలీసుల అదుపులో ఎవడ్రా హీరో

Satyam NEWS

Leave a Comment