35.2 C
Hyderabad
April 24, 2024 13: 40 PM
Slider చిత్తూరు

బర్డ్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు అమానుషం

BIRD hospital

ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు రాక చాలీచాలని జీతాలతో ఏనాటికైనా పర్మనెంట్ అవుతాం అన్న నమ్మకంతో పనిచేస్తున్న బర్డ్ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

బర్డ్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా తప్పు చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలే తప్ప అందరినీ తొలగించడం కక్ష సాధింపు చర్య అని ఆయన అన్నారు. బర్డ్ సెక్యూరిటీ సిబ్బందికి ఈఎస్ఐ, పీఫ్ లతో పాటు బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ప్రసాదాలతో అనేక సౌకర్యాలు అధికారికంగా కల్పిస్తున్నారని అలాంటి సిబ్బందిని అకస్మాత్తుగా ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు.

బర్డ్ ఆస్పత్రిలో గత 8 సంవత్సరాలుగా 3500 జీతం నుంచి నేటి 9800 జీతం వరకు పనిచేస్తున్న 50 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఏ కారణం లేకుండా ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా విధుల నుంచి తొలగించడం దారుణమైన విషయమని ఆయన అన్నారు.

టీటీడీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు మారినప్పుడు సైతం పనిచేసే సిబ్బందిని ఎన్నడూ తొలగించలేదు మరి బర్డ్ ఆస్పత్రిలో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ గడువు ముగిసిందన్న  సాకుతో సెక్యూరిటీ సిబ్బందిని తొలగించడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. బర్డ్ ఆస్పత్రిలోని కొంతమంది ఉన్నతాధికారులు సెక్యూరిటీ సిబ్బందిపై టీటీడీ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తొలగించడం దుర్మార్గమని ఆయన అన్నారు.

బర్డ్ ఆసుపత్రి లోని సెక్యూరిటీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా టిటిడి చైర్మన్,ఈవో,తిరుపతి జే ఈ ఓ, బర్డ్ డైరెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.

Related posts

హుజుర్ నగర్ లో ఘనంగా పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి

Bhavani

కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కార్మిక ఉద్యమం ఉధృతం

Satyam NEWS

తెలంగాణ రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సారంగపాణి

Satyam NEWS

Leave a Comment