30.3 C
Hyderabad
March 15, 2025 09: 30 AM
Slider నల్గొండ

పేదలకు అన్నదానంతో పుట్టిన వేడుకలు

birthday

అత్యంత హంగు ఆర్భాటాలతో బంధువులతో నిర్వహించుకునే పుట్టినరోజు వేడుకలను నిరుపేదలకు అన్నదానం నిర్వహించి తమ దాతృత్వం నిరూపించుకున్నారు ఈ దంపతులు. హుజూర్ నగర్ లోని గుండా శ్రీనివాస్, జ్యోతి ల కుమార్తె మహతి పుట్టిన రోజు సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా “మానవ సేవే మాధవ సేవగా” గుర్తించి నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు.

కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సందర్భంగా పట్టణంలోని నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆపత్కాలంలో సాటి మనిషిని ఆదుకోవాలని గుండా శ్రీనివాస్ దంపతులు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  తహసీల్దార్ జయశ్రీ మాట్లాడుతూ ఇలాంటి దాతలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని అప్పుడే మానవసేవే మాధవసేవ అవుతుందని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో స్థానిక శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం కార్యనిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ వరద బాధితులకు ఢిల్లీ సిఎం విరాళం

Satyam NEWS

17న విజయనగరం లో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS

ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” గ్లింప్స్ విడుదల

Satyam NEWS

Leave a Comment