31.7 C
Hyderabad
April 19, 2024 02: 40 AM
Slider చిత్తూరు

బొజ్జల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

#chandrababu

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి కి టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆనారోగ్యం తో ఆసుపత్రిలో చికిత్స పొందిన బొజ్జల… ప్రస్తుతం ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఇంట్లోనే ఉంటున్నారు.

శుక్రవారంనాడు బొజ్జల పుట్టిన రోజు కావడంతో చంద్రబాబు స్వయంగా హైదరాబాద్ లోని బొజ్జల ఇంటికి వెళ్లి బొజ్జలతో పాటు వారి కుటుంబ సభ్యులతో కొద్ది సేపు గడిపారు. బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ని చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా పలకరించారు. బొజ్జల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కేక్ కటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారు.  బొజ్జలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనకు చంద్రబాబు కేక్ తినిపించారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని తెలుకుని…జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts

విజ‌యీభ‌వ‌: ఒలింపిక్స్ బృందానికి విజయనగరం క‌లెక్ట‌ర్ శుభాకాంక్ష‌లు

Satyam NEWS

ఈ నెల 13 వరకు అవకాశం

Bhavani

రాజంపేటలో భారత్ బంద్ విజయవంతం…

Satyam NEWS

Leave a Comment