37.2 C
Hyderabad
April 19, 2024 14: 29 PM
Slider ప్రకాశం

నాన్నా.. నువ్వే నా బ‌లం……!

#karanambalaram

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంకు ఆయ‌న కుమార్తె కరణం అంబికా కృష్ణ వినూత్న రీతిలో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. “నాన్న‌కు ప్రేమ‌తో”.. నువ్వే నా బ‌లం… నువ్వే నా బ‌ల‌హీన‌త అంటూ ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కుమార్తె కరణం అంబికా కృష్ణ తెలుగుదేశం పార్టీ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు.

క‌ర‌ణం బ‌ల‌రాం జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయన కుమార్తె స‌రికొత్త రీతిలో విషెస్ చెప్పడం చర్చనీయాంశం అయింది. నీ చిరున‌వ్వు చాలు నా బాధ‌ను త‌రిమేందుకు.. నీ మాట‌లు చాలు  నా క‌ష్టాన్ని మ‌రిపించేందుకు.. ఈ జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వ‌రం నువ్వే నాన్న.. అంటూ నాన్న‌కు ప్రేమ‌తో అంబికా కృష్ణ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ ఒక సందేశాత్మ‌క చిత్రాన్ని రూపొందించారు.

త‌ల్లిదండ్రుల‌పైన పిల్ల‌ల‌కు ఉండే ప్రేమ చిన్న‌త‌నంలోనే కాదు.. ఏ ద‌శ‌లో ఉన్నా అది ఒకే విధంగా ఉంటుంద‌ని కూతురుగా తండ్రిపై త‌న‌కున్న ప్రేమ‌ను అంబికా కృష్ణ చాటుకున్నారు.

Related posts

చెంచుల అభివృద్ధికి పక్కాగా ప్రభుత్వ పథకాల అమలు

Satyam NEWS

కాంట్రవర్సీ: పేదలకు మేలు చెయ్యని నిర్ణయం ఇది

Satyam NEWS

విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్ కల్యాణ్

Satyam NEWS

Leave a Comment