ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఘనంగా సేవా సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. డిచ్ పల్లి లోని మానవతా సదన్ లో 113 పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం పోచంపాడు లోని శ్రీ గురుదత్త వాత్సల్య నిలయంలో దుప్పట్లు పంపిణీ చేశారు. సేవా సప్తాహ కార్యక్రమం దేశవ్యాప్తంగా 14 నుంచి 20 వరకు సాగనుంది. అందులో భాగంగా 15 వ తేదీన భీంగల్ లో మెగా హెల్త్ క్యాంపు, నిజామాబాద్ బస్వా గార్డెన్స్ లో రక్తదాన శిబిరం, 16 వ తేదీన ఉదయం కాకతీయ ఇన్స్టిట్యూషన్ లో , మధ్యాహ్నం జగిత్యాల చాణక్య స్కూల్ లో ప్లాస్టిక్ డిస్పోజల్ మీద అవగాహన కార్యక్రమం, 18 వ తేదీన మెట్పల్లి లో డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఉచిత శస్త్ర చికిత్స కార్యక్రమం, అర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం, 19 వ తేదీన ఆర్మూర్ zphs పాఠశాల లో స్టేషనరీ వస్తువుల పంపిణీ కార్యక్రమంతో పాటు మరిన్ని కార్యక్రమాల లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి పాల్గొననున్నారు.
previous post