27.7 C
Hyderabad
April 19, 2024 23: 08 PM
Slider నిజామాబాద్

ఉపాధి నిధులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు

#kamareddy

రైతు కల్లాలు, రైతు వేదికలు కూలీలతో నిర్మించి కూలీలకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ నిధులను తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి నిధులను దారి మళ్లించడమే కాకుండా కేంద్రంపై నిందలు వేస్తూ ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం కేంద్రం ఉపాధి నిధులు అడిగితే కేంద్రంపై నిందలు మోపుతూ నిరసన వ్యక్తం చేరిన బీఆర్ఎస్ తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ..రైతుల కల్లాలు కడితే ప్రధాని మోదికి కడుపు మంట ఎందుకు ఉంటుందని, రైతాంగం చల్లగా ఉంటే మోడీ సంతోషిస్తారన్నారు.

ధర్నా చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే చెల్లిందని విమర్శించారు. ఉపాధి పనుల నిధులు వాపస్ అడుగుతున్నందుకు ధర్నా చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఒక్క రైతు కల్లం నిర్మించడానికి అయ్యే ఖర్చు 85,473 రూపాయలని, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1693 రైతు కల్లాలకు 12.23 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాష్ట్రం మొత్తం మీద 87018 రైతు కల్లాలు నిర్మించాలని కేంద్రం అనుమతి ఇస్తే చేతకాని ఈ ప్రభుత్వం కేవలం 14320 కల్లాలు మాత్రమే నిర్మించిందని ఎద్దేవా చేశారు.

కల్లాల నిర్మాణానికి 93 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 80 వేల కల్లాలు నిర్మించాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గొప్పదా.. చేతకాక 14 వేలు మాత్రమే నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా రైతులు ఆలోచించాలన్నారు. రైతు వేదికలు కామారెడ్డి నియోజకవర్గంలో 25, ఎల్లారెడ్డి నియోజకావర్గంలో 35, జుక్కల్ నియోజకవర్గంలో 34 కట్టారని, స్పీకర్, డీసీసీబీ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం 10 రైతు వేదికలు మాత్రమే నిర్మించారని ఎద్దేవా చేశారు.

జిల్లాలో మొత్తం 104 రైతు వేదికలు నిర్మించి ఒక్కొక్క రైతు వేదికకు 25 లక్షల చొప్పున 22.88 కోట్లు ఖర్చు చేశారని, ఈ లెక్కలు ఎన్ఆర్ఈజిఎస్ నివేదిక ప్రకారం వచ్చినవని తెలిపారు. రైతు కల్లాలు, రైతు వేదికలు ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించడానికి 30 శాతం లేబర్ కు, 70 శాతం మెటీరియల్ కు ఖర్చు చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణం చేపట్టి అవినీతికి పాల్పడిందని తెలిపారు. ఉపాధి హామీ గైడ్ లైన్స్ ప్రకారం పథకంలో ఉన్న పనులు మాత్రమే చేపట్టాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లించి ఇతర పనులు చేపట్టిందన్నారు.

నిధులను కాంట్రాక్టర్ల పరం చేసి అవినీతికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కొరడా ఝులిపిస్తూ నిధులను వాపస్ ఇవ్వాలని కోరిందని పేర్కొన్నారు. రైతు వేదికలు, కల్లాల నిర్మాణం కోసం కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిందని తెలిపారు. అలా చేయకుండా ఇష్టానుసారం పనులు చేపట్టి అవినీతికి పాల్పడిందన్నారు. ఇదంతా చెప్పుకోలేని బీఆర్ఎస్ నాయకులు ఉపాధి నిధులు వెనక్కి ఇవ్వుమంటోంది అని కేంద్రంపై నెపం నెడుతోందని విమర్శించారు. జిల్లాలో ఉన్న స్పీకర్, విప్, ఎమ్మెల్యేలు, రైతు సమన్వయ సమితి నాయకులు, డిసిసిబి చైర్మన్లు ఎవరైనా అధికారులను తీసుకుని చర్చకు వస్తే మీడియా ముందు మాట్లాడుదామని, సాక్షాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడవద్దు గంప గోవర్ధన్ గారు.. అన్నారు. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా.. ఓపెన్ డిబేట్ పెడదాం.. నిధులపై చర్చిద్దామని స్పష్టం చేశారు.

Related posts

ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ

Bhavani

సిన్సియర్ అధికారిపై జగన్ సర్కార్ బదిలీవేటు

Satyam NEWS

గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులపై సీఎం రేవంత్ న్యాయవిచారణ చేయిస్తారా?

Satyam NEWS

Leave a Comment