28.7 C
Hyderabad
April 20, 2024 03: 55 AM
Slider నిజామాబాద్

దళిత ద్రోహిగా మారిన భారతీయ జనతా పార్టీ: టీఆర్ఎస్ వ్యాఖ్య

#trsbichkunda

దళిత బంధు పథకం అమలును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బిజెపి దళిత ద్రోహిగా మారిందని వారు తీవ్రంగా ఆరోపించారు. బిజెపి తీరుపై కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

హుజూరాబాద్ లో ఎలాగూ ఓడిపోతామన్న భయంతోనే  వారు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో   ఎన్నికల ప్రకటన కన్నా ముందే  దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన విషయం విదితమే కానీ వారు  ఎన్నికల స్టంట్ అనుకొని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం వారికి ఉన్న దళితుల ప్రేమ కపటమైన ప్రేమగా గుర్తించాల్సిందేనని అన్నారు.

అక్కడున్న దళితులు  మోడీకి ఈటెలకు తగిన శాస్తి చెప్పాలని వారు ఈ సందర్భంగా ఒక ప్రకటనలో కోరారు.  భాజపా ఎప్పటికీ   దళిత వ్యతిరేకి గానే ఉందని మరోమారు వారు స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో దళితులు  ఈ విషయాన్ని గమనించలిసిందేనన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని అందులో భాగంగానే ప్రతి దళిత కుటుంబాలకు లక్షాధికారి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దళిత బంద్ ను ప్రకటించిందనే విషయాన్ని గుర్తుచేశారు. ఏదేమైనప్పటికీ భారతీయ జనతాపార్టీకి హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రాజు,తెరాస ప్రధాన కార్యదర్శి రాంచందర్, మాజి జెడ్పీటీసీ సాయిరామ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు హనుమాన్లు, మండల యూత్ అధ్యక్షులు గణేష్ గొoడా,నాయకులు బొమ్మల లక్ష్మణ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింలు తదితరులు ఉన్నారు.

Related posts

అమృత్ ఉద్యాన్ గా మొఘల్ గార్డెన్స్

Murali Krishna

ఇండియన్ పనోరమాలో తమిళ సినిమా ‘కిడ’కు స్టాండింగ్ ఒవేషన్

Bhavani

`సీటీమార్` సెట్ లో త‌మ‌న్నాబ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

Sub Editor

Leave a Comment