36.2 C
Hyderabad
April 18, 2024 13: 45 PM
Slider చిత్తూరు

పోలీసుల కొంప ముంచిన బిజెపి చికెన్ బిర్యానీ

kalahasthi 1

కరోనా… ఆ వైరస్ సోకిందంటే రోగ నిరోధ శక్తి లేకపోతే ఛస్తారు అని చెబుతున్నా రాజకీయ నాయకులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళుతూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినా, స్థానిక పోలీసులు కను రెప్ప వేయకుండా కాపలా కాస్తున్నా కరోనా వ్యాపిస్తూనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇది మరింత విస్తృతంగా ఉంది. చిత్తూరు జిల్లా లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తి లో కరోనా క్షణ క్షణానికి వ్యాప్తిస్తున్నది. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం శ్రీకాళహస్తి లో మరో 11 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. వీరంతా పోలీసులే కావడం గమనార్హం.

ఇప్పటికే 9 మంది రెవెన్యూ సిబ్బందికి కరోనా పాజిటీవ్ రాగా ఇప్పుడు పోలీసులకు పాజిటీవ్ వచ్చింది. పోలీసులకు కరోనా పాజిటీవ్ రావడం వెనుక స్థానిక బిజెపి నాయకుడు కోలా ఆనంద్ అత్యుత్సాహం ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

ఆయన గత ఆదివారంనాడు పోలీసులందరికి చికెన్ బిర్యానీ పార్సిల్ అందచేశారు. సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కోలా ఆనంద్ నాయకత్వంలో బిజెపి కార్యకర్తలు వెళ్లి పోలీసులకు బిర్యానీ ప్యాకెట్లు అందచేశారు. ఆదివారం చికెన్ పై నిషేధం ఉంది. ఆ రోజు మాంసాహారం అమ్మడం నిషేధం.

లాక్ డౌన్ నిబంధనలు అన్నీ విస్మరించి సామాజిక సేవ పేరుతో బిజెపి నాయకుడు చేసిన ఈ పని తో ఇప్పుడు పోలీసులకు ఇబ్బంది వచ్చి పడింది. కోలా ఆనంద్ బృందం నుంచి చికెన్ బిర్యానీ ప్యాకెట్ ను అందుకున్న ఒక మహిళా ఎస్ ఐకి నిన్ననే కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. నేడు టూ టౌన్ పోలీసులందరికి పాజిటీవ్ రావడంతో వారిని అందరికి క్వారంటైన్ కు తరలించారు.

వీరిలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్ప మిగిలిన వారంతా కోలా ఆనంద్ నుంచి చికెన్ బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్నవారేనని స్థానికులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే శ్రీకాళహస్తి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ కరోనా ఏ విధంగా విస్తరిస్తున్నదో ప్రత్యేక అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు. నేడు జరిగిన ఈ సంఘటపై కూడా ప్రత్యేక బృందం ఆరా తీస్తున్నది. మరీ ముఖ్యంగా పోలీసులకు కరోనా పాజిటీవ్ రావడం అదీ కూడా రాజకీయ నాయకుల నుంచి రావడంతో ఇది పెను సమస్యగా మారింది.

Related posts

సంతాపం: జన నాయకుడికి అశ్రునివాళి

Satyam NEWS

గోవిందరాజ స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు

Bhavani

ఏపీలో జూనియర్ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి

Satyam NEWS

Leave a Comment