39.2 C
Hyderabad
March 29, 2024 13: 27 PM
Slider కృష్ణ

ప్రధాని మోదీ నవ వసంతాల పాలనా విజయాల ప్రచారం

#vishnuvardhanreddy

 ” నేషన్ ఫస్ట్ ”  నినాదంతో తొమ్మిది ఏళ్ల కిందట 2014లో దేశ భవిష్యత్ ను మార్చే మహోన్నత బాధ్యతలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ భుజాన వేసుకున్నారు. దేశ ప్రజలంతా ముక్తకంఠంతో మోదీ ..మోదీ అనే విజయధ్వానాల మధ్య అందించిన బాధ్యత అది. ఐదేళ్ల తర్వాత కూడా అంటే 2019లో తనకు ఇచ్చిన బాధ్యతలను వంద శాతం అద్భుతంగా నిర్వహించాలని గతం ఎక్కువ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించారు. ఈ తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు అనితర సాధ్యం.

దేశంలోని అట్టడుగు నిరుపేద కడుపు నిండా తినడానికి లోటు లేకుండా చేయడం దగ్గర్నుంచి  ప్రపంచంలోనే భారత్ పలుకుబడి ఎవరూ ఊహించనంతగా పెరగడం వరకూ భిన్న పార్వ్శాలుగా పాలనా విజయాలు నమోదయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను ప్రజల ముందు ఉంచడానికి నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిర్ణయించింది. దీని కోసం ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

గన్నవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  మే 30 నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల విజయాలపై ప్రచారం చేయాలని నిర్ణయించడం జరిగిందని నవ వసంతాల విజయాల ప్రచార కమిటీ కన్వీనర్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి యస్, విష్ణువర్ధన్  రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు కార్యక్రమాలపై ప్రచారం చేయాలని బీజేపీ జాతీయనేతలందితో పాటు కేంద్ర మంత్రులు , ఎంపీలందరికీ రాష్టంలో పర్యటించి ప్రచారం చేయాలని కేంద్ర పార్టీ అన్న విభాగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని  నిర్ణయించారు.  ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు, క్రీడాకారులు, కళాకారులు, వ్యాపారులు, వ్యాపారుల వంటి నిపుణులను ఈ కార్యక్రమమంలో భాగస్వాములను చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వీరు ఎలా లబ్ది పొందారో ఆయా వర్గాలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహి్తారు.  మోదీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలుస్తారు.  వారి జీవితంలో వచ్చిన మార్పులను అందరికీ తెలిసేలా కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు.

ప్రధాని మోదీ పాలనా విజయాలపై ప్రచారంలో బాగంగా పార్టీ నేతల నేతృత్వంలో అన్ని జిల్లాలో మత పెద్దలు, మాజీ సైనికులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు మొదలైన వారిని సంప్రదిస్తుంది.  రైతులు, కూలీలు, పేదలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, యువత, గ్రామీణాభివృద్ధి కోసం చేసిన పనులను ప్రచారం చేయడానికి పార్టీ నేతల్ని, లబ్దిదారుల్ని సమన్వయం చేసుకుంటుంది. నెల రోజుల కాలంలో  కేంద్రం రాష్ట్రంలో చేసిన మౌలికమైన అభిృద్ది పనులు, సంక్షేమ పథకాల్లో కేంద్ర నిధుల గురించి ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు.

ఏపీలో ఓ భిన్నమైన పరిస్థితి ఉంది.

కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రం తమ పథకాలుగా అమలు చేసుకుంటూ స్టిక్కర్లు వేస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు చేస్తున్న సాయంలో సగం కేంద్రం ఇచ్చేదే. రాష్ట్రానికి నలభై లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఏపీలో ప్రభుత్వం ఒక్క అభివృద్ది పని చేపట్టడం లేదు. ఇక్కడ ఏ అభివృద్ధి పని జరుగుతున్నా ఉదాహరణకు నేషనల్ హైవేస్ కనీ .. రైల్వేస్టేషన్లు కానీ..ఎయిర్ పోర్టులు కానీ మొత్తం కేంద్ర నిధులతోనే. గ్రామీణ ప్రాంతాల్లో జరిగేపనులకూ ఉపాధి హమీ, గ్రామీణ రహధారులుకు సైతం ,ప్రాథమిక విద్యకు కేంద్రమే నిధులిస్తోంది.

కానీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్ని 80 శాతం దారి మళ్లిస్తోంది. మిగిలిన వాటితోనే పనులు జరుగుతున్నాయి.  ఈ వివరాలన్నింటినీ నెల రోజుల పాటు ప్రజల ముందు ఉంచి…వారిని చైతన్యవంతుల్ని చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీ బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను నిర్వహించింది. దాదాపు ఏడు వేల స్ట్రీట్  కార్నర్ సభలు నిర్వహించాము, ప్రజా ఛార్జిషీట్ ద్వారా ప్రజలు సమస్యలు గుర్తించడం జరిగింది. ఒక వైపు ప్రజా ఉద్యమాలతో పాటు 9 సంవత్సరాల పాలన విజయవంతమైన సందర్బంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మోదీ ప్రభుత్వ విజయాలతోపాటు నేడు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వైపల్యాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు .

Related posts

షేమ్ షేమ్ : అత్యాచారాల భారత దేశం

Satyam NEWS

సొంత చెల్లెలిపై దుష్ప్రచారం మొదలు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా

Satyam NEWS

జ‌ర్న‌లిస్ట్  పిల్ల‌ల ఫీజు త‌గ్గింపుపై  జీఓ ఉంటే చూపించండి..!

Satyam NEWS

Leave a Comment