శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు ఎంపిటిసి బిజెపి అభ్యర్థిగా, రాగోలు గ్రామానికి చెందిన చల్లా రాజాకు బి-ఫారం అందజేసినట్లుగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జ్ చల్లా వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ రోజు బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పాతిన గడ్డెయ్య, రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు సమక్షంలో చల్లా రాజాకు అందజేసారు.
ఇంజనీరింగ్ చదివి, ఎంబిఎ పూర్తి చేసిన రాజా బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిటిసిగా పోటీ చేయడం హర్షించదగన విషయమని చల్లా వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు బిజెపి మండల అధ్యక్షులు ఇప్పిలి సీతరాజు, పూజారి చెల్లయ్య, పండి యోగేశ్వర రావు, కురమాన మల్లేశ్వర రావు, అనంత్ తదితరులు ఉన్నారు.