28.7 C
Hyderabad
April 20, 2024 06: 59 AM
Slider ప్రత్యేకం

లబ్దిదారులకు నెలరోజుల్లో సిఎంఏవై ఇళ్లు ఇవ్వాలి

#vishnu 20

రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల్లో లబ్దిదారులకు పిఎంఏవై పథకం ఇళ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు పేదలకు ఇళ్లివ్వకుండా నట్టేట ముంచాయని ఆరోపించారు. పట్టణ, గ్రామీణ హౌసింగ్ నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.3 వేల కోట్లు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఒక్క ఇల్లును కూడా లబ్దిదారులకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.

ఒక్క రూపాయికి 300చ.అ. ఇల్లు, రూ.500 లకే రిజిస్ట్రేషన్ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఆ హామీని ఉద్దేశ్యపూర్వకంగానే నెరవేర్చడం లేదన్నారు. కేంద్రం ఇచ్చి ఇంటి మోదీ ప్రభుత్వానికి వచ్చే పేరును సహించలేక ఇళ్లను ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దేశంలోనే అత్యధికంగా 26 లక్షల ఇళ్లను కేటాయిస్తే కేవలం 4.60 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తిచేసినట్లు 14 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభంలో ఉందని రాష్ట్రం కేంద్రానికి తెలిపిందని చెప్పారు.

లబ్దిదారుల పేరుతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ. 3 వేల కోట్లు తీసుకుని, లబ్దిదారులు రీపేమెంట్లు బ్యాంకులకు ప్రారంభించి కూడా అర్బన్ పథకంలో 1,43,600 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినా ఇళ్లు లబ్దిదారులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు రూ.7 వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్లను స్వాధీనం చేయలేదని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.250 నుంచి రూ.350 వరకు అవినీతి చేసిందని ఆరోపించి రూ.3,200 కోట్ల పనులకు రివర్స్ టెండర్లు ఆహ్వానించి రూ.300 కోట్లు ఆదాచేశామని చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు దీనిపై విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు.

గత ప్రభుత్వపు మంత్రి నారాయణ లేదా చంద్రబాబుతో ఏమైనా లాలూచీ పడ్డారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై కుంభకోణం జరిగితే కేంద్రానికి రాయకుండా, మీరు విచారణ చేపట్టకుండా ఎందుకు ఉపేక్షించారని ఇందులో క్విడ్ ఉందని తెలుస్తోందని అన్నారు.

రైతులకూ మోసమే

కేంద్రప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడ వల్లే రైతులకు తాము సేకరించిన ధాన్యానికి కాయిలు చెల్లించలేకపోతున్నామని వైకాపా ప్రభుత్వం ఆరోపించడాన్ని విష్ణువర్ధన్రె డ్డి తప్పుపట్టారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోడానికి కేంద్రంపై అభాండం వేయడాన్ని మానుకోవాలని సూచించారు. పీడీ ఖాతాల విషయంలో వేల కోట్లు దారి మళ్లించిన ప్రభుత్వానికి ధాన్యం సేకరణలో రూ.3 వేల కోట్లు సర్దుబాటు చేసుకోలేరా అని ప్రశ్నించారు.వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిన దాదాపు రూ.50 వేల కోట్లకు సంబంధించిన పీడీ ఖాతాలపై ఎందుకు తేదేపా నాయకుడు యనమల మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంతో పాటు తేదేపా ప్రభుత్వం పీడీఖాతాల్లోని రూ.53 వేల కోట్లు అవినీతి చేయడం కోసమే దారి మళ్లించాయని ఆరోపించారు.

కేసీఆర్ నీటిదొంగే

ఎపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్ర జోక్యాన్ని కోరిన టీఆర్ఎస్, వైకాపాతో సహా వామపక్షపార్టీలు ఇప్పుడు రెండునాల్కల ధోరణితో కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని, రాష్ట్రాల హక్కులను హరిస్తుందని విమర్శిస్తున్నాయన్నారు. ఎపీకి చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు హైదరాబాదులో ఉండి వారి మోచేతి నీరు తాగుతుండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నీటిని వాడేసుకుంటున్నా నేరెత్తలేకపోయారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తెరాసా నాయకుల్లా రాజకీయాల కోసం కుట్ర పన్నడం భాజపా అధ్యక్షులు సోమువీర్రాజు అభిమతంకాదన్నారు.

తెలంగాణ, ఏపీ ప్రజలు బావుండాలని కాంక్షిడమే ఆయనకు తెలుసని తెరాసా నాయకుల విమర్శలకు ప్రతి విమర్శ చేశారు. తెరాసా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాసులు నోరు అదుపులో పెట్టుకోకుంటే తెలంగాణా సమాజం ఛీకొడుతుందని ఈసడించారు. కృష్ణానీటిని అక్రమంగా దొంగిలించి, అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తూ, దక్షిణ తెలంగాణ, రంగారెడ్డి జిల్లాకు ద్రోహం చేస్తున్నదీ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీవి అక్రమప్రాజెక్టులు కాకుండా ఉంటే ఎందుకు కేంద్ర జోక్యంపై కేసీఆర్ భయపడుతున్నారని. గద్దించారు.

ప్రకాశం జిల్లాకు రాయలసీమ ప్రాజెక్టు వ్యతిరేకమని తెదేపా నాయకులు మాట్లాడినా, రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు జిల్లాకో వాదాన్ని వినిపిస్తూ చివరకు కెసీఆర్కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు.

జగన్, కెసీఆర్లు దాగుడుమూతలు, డూప్లికేట్ ఫైట్లు ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయంతో ఎపీకి, తెలంగాణకు న్యాయం జరుగుతుందని విష్ణువర్ధన్రెడ్డి ఆకాంక్షించారు. వైకాపా ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చేసిన విపరీత ప్రచారం వల్లనే తెరాసా ఆ ప్రాజెక్టుపై ఫిర్యాదులు చేసిందని గుర్తుచేశారు.

మంత్రి కొడాలి ఎందుకు స్పందించారు? ఖరీదైన బెంజికారును కానుకగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన మంత్రిపై, గత ప్రభుత్వంలో ఈఎస్ఐ కుంభకోణంలో ముద్దాయిగా ఉండి, ఒక ఫైవ్ స్టార్ హెూటల్లో ఏడాదిగా ఉంటూ దందాలు వసూలుచేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన మంత్రిపై, అలాగే మరో మంత్రిపై ఆ మధ్య వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని విష్ణువర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.

ఒక ఉన్నతాధికారి బంగ్లా నిర్మించి ఒక మంత్రికి ఇచ్చారనే ఆరోపణల్లో మంత్రి కొడాలి నాని ఎందుకు స్పందించారని ఆక్షేపించారు. ఈ ఆరోపణను సవాలుగా తీసుకుని రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో అర్బన్ హౌసింగ్ భూముల కొనుగోళ్లలో 45 ఎమ్మెల్యేలు సుమారు రూ.2 వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. మీడియా సమావేశంలో ఒబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బి శివన్నారాయణ పాల్గొన్నారు.

Related posts

రామప్ప దేవాలయం సందర్శించిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్

Satyam NEWS

సోము వీర్రాజు అభిమాని ఆత్మహత్యాయత్నంతో అలజడి

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

Satyam NEWS

Leave a Comment