27.7 C
Hyderabad
April 26, 2024 05: 19 AM
Slider రంగారెడ్డి

పత్తి రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి

#BJPRangareddy

అకాల వర్షం కారణంగా రంగారెడ్డి జిల్లా లో రైతులకు కలిగిన భారీ నష్టానికి తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ చౌదరిగుడా మండల కమిటీ డిమాండ్ చేసింది.

బిజెపి ఆధ్వర్యంలో నేడు ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కు  వినతి పత్రం సమర్పించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీటిలో మునిగి భారీ నష్టం రైతులకు జరిగిందని బిజెపి మండల అధ్యక్షుడు కొనేరి శ్రీనివాస్ తెలిపారు.

ప్రభుత్వం చెప్పినట్టు చౌదరి గూడెం మండలం లో 90 శాతం రైతులు పత్తి పంటను వేశారని ఆయన తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట పూర్తిగా నీట మునిగింది.

కావున ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చౌదరిగుడా మండల బిజెపి శాఖ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోచర్చా జిల్లా నాయకులు శివ రెడ్డి, భూపాల చారి, లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్ రెడ్డి, మండల కిసాన్మోర్చా అధ్యక్షులు గొల్ల మల్లేష్ పాల్గొన్నారు.

Related posts

గుడ్ వర్డ్: వర్ణించలేని మహాకావ్యం ‘అమ్మ’

Satyam NEWS

మెరుగైన సేవలు అందించిన అధికారులకు సన్మానం

Satyam NEWS

అనుమానాస్పద వ్యక్తుల పట్టివేత

Satyam NEWS

Leave a Comment