30.3 C
Hyderabad
March 15, 2025 10: 24 AM
Slider కడప

దేవాదాయ భూములపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్

#BJP Kadapa

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదేవాదాయ భూములు, వాటి ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కడప జిల్లా రాజంపేట కు చెందిన నాగోతు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో  కూడా రాష్ట్ర  ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించ కూడదని బీజేపీ కోరుకుంటున్నదని ఆయన అన్నారు.

నేడు ఆయన దేవాలయ భూముల పరిరక్షణకు ఒక రోజు దీక్ష చేపట్టారు. హిందూ ధర్మానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించిన  బిజెపి సహించదని ఆయన అన్నారు. అందుకోసం హిందువులందరూ కూడా సంఘటితం కావలసినటువంటి సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.

వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెందిందని, ఒక సంవత్సరం కాలంలో ప్రజలకు చేసింది శూన్యం అని ఆయన అన్నారు. అప్పు చేసి పప్పు కూడు అనే చందంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన అన్నారు.

Related posts

టీటీడీ భూములు అమ్మడం నిలిపివేయండి

Satyam NEWS

వనపర్తి జిల్లా పోలీస్ ప్రజావాణిలో 12 ఫిర్యాదులు

Satyam NEWS

4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ దే

mamatha

Leave a Comment