27.7 C
Hyderabad
April 26, 2024 04: 18 AM
Slider మహబూబ్ నగర్

గజ్వేల్ దళిత రైతు మరణం ప్రభుత్వ హత్య

#Nagarkurnool BJP

దళితులపై టిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ అమ్రాబాద్ మండల కేంద్రంలో  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.  తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన బిజెపి నాయకులు తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమ్రాబాద్ మండల బిజెపి అధ్యక్షులు మంగళగిరి శంకర్ జి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వర్గాల మండల వేళ్లూరు గ్రామ దళిత రైతు బ్యాగరి నర్సింలు హత్య ప్రభుత్వ హత్యే. ఆయనకు సంబంధించిన 14 గుంటల భూమిని ప్రభుత్వం లాక్కోవడం తో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి మొన్న మరణించాడు.

ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే షామీర్ పేట్ వద్ద రాష్ట్ర నాయకులను  అరెస్ట్ చేయడం సిగ్గుతో ప్రభుత్వం తలదించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దళిత ప్రజాప్రతినిధుల పై దాడులు షరా మామూలైంది.

రాష్ట్రంలో దళితుల పైన జరుగుతున్న దాడులు చాలా విడ్డురం అని క్షమించరానివి అని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తాం అని చెప్పారు. ఒక దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పిన కేసీఆర్ ఈ రోజూ దళితుల పైనా దాడి జరగడం సిగ్గు చేటు అని ఆయన మండి పడ్డారు.

ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా దళిత వ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వపై పోరాటాన్ని కొనసాగిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ శివ సర్వేష్ లక్ష్మణ్ శివ సురేష్ పవన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా రోగుల్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి

Satyam NEWS

Tragedy: జనగామ జిల్లాలో రైతు ఆత్మహత్య

Satyam NEWS

మౌలాలీ లో వినియోగదారుల హక్కుల సదస్సు

Satyam NEWS

Leave a Comment