31.2 C
Hyderabad
April 19, 2024 06: 17 AM
Slider ప్రత్యేకం

గిరిజనుల తరపున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీనే

#bandisainjai

రాష్ట్రంలో ఉన్న 12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ కే గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.ఈ మేరకు హైదరాబాద్ లో రాడిషన్ హోటల్ లో మిషన్-12 పేరుతో ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాల సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ తో పాటు 12 నియోజకవర్గాల నాయకులు, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.కేసీఆర్ గిరిజనులకు చేస్తున్న అన్యాయం పై పోరాడే సత్తా కేవలం బీజేపీ కి మాత్రమే ఉందని ఈ సమావేశానుద్దేశించి బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ సర్కార్ గిరిజనులకు తీరని ద్రోహం చేసిందని ఆయన అన్నారు.  గుర్రంపొడు భూముల బాధిత గిరిజనుల తరపున, అసిఫాబాద్ లో పొడు రైతుల  బీజేపీ పోరాడిందని సంజయ్ చెప్పారు.రాష్ట్రం లో బీజేపీయే తమ భరోసా అని గిరిజనులు భావిస్తున్నారని ఆయన అన్నారు.12 ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీ లతో పాటు గిరిజనేతరులను కలుపుకుని పోయే విధంగా కార్య క్రమాలు రూపొందించాలని సంజయ్ చెప్పారు.

గిరిజన రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు.త్వరలో మిషన్ 12 -ఎస్టీ నియోజకవర్గ మూల సమన్వయ కమిటీ పర్యటిస్తుందని సంజయ్ చెప్పారు.ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్, రమేష్ రాథోడ్, చాడ సురేష్ రెడ్డి, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి, పార్టీ  ప్రధానకార్యదర్శులు బంగారు శ్రుతి, ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, మాజీ ఎంఎల్ఏ కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

మోడీ మంత్రి వర్గంలో చేరనున్న వై ఎస్ జగన్ పార్టీ?

Satyam NEWS

పోస్టాఫీసు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

రాజకీయ పార్టీలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దు

Satyam NEWS

Leave a Comment