రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని హబ్సిగూడ కార్పొరేటర్ కత్తిరేని చేతన హరీష్ అన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా హబ్సిగూడ డివిజన్ పరిధిలో పలు కాలనీలలో శక్తి కేంద్ర ఇంఛార్జుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి చేతన హరీష్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా పనిచేయాలనీ, రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని పిలుపునిచ్చారు.
సత్యం న్యూస్, మేడ్చల్