39.2 C
Hyderabad
March 29, 2024 14: 45 PM
Slider కరీంనగర్

బండి సంజయ్ అరెస్టు కు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ సమాయత్తం

#bandisainjai

ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకైనా వెళ్తా….. ఎంతదాకానైనా పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు.. తెలంగాణ  బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాగా గడచిన 24 గంటల నుంచీ పార్టీ అధ్యక్షుడు తన కార్యాలయంలో చేస్తున్న దీక్ష తీవ్ర తరమైంది. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్ ను రిమాండ్ చేసేందుకు పోలీసులు సిద్దమవడంపట్ల కార్యకర్తల్లో  ఆగ్రహావేశాలు పెల్లుబీకుతున్నాయి. అయితే బండి సంజయ్ ను బేషరతుగా విడుదల చేయాలంటూ కరీంనగర్ కు భారీగా తరలివస్తున్నారు…పార్టీ కార్యకర్తలు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. కొద్ది సేపటి క్రితం బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన జేపీ నడ్డా  ‘‘సంజయ్ జీకి నా మాటగా చెప్పండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ జీ చేస్తున్న పోరాటం భేష్…. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు. మేం చూసుకుంటాం… న్యాయ స్థానంలో మేం పోరాడతాం. జాతీయ నాయకత్వం యావత్తు  సంజయ్ జీ వెంట ఉంది.  గో…హెడ్’’ అని భరోసా ఇచ్చారు..కరీంనగర్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు బండి సంజయ్ ను హాజరుపర్చారు పోలీసులు.

పాత కేసులను కూడా ఇవాల్టి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.. పోలీసులు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని గతంలో నమోదైన ఐపీసీ 353 సెక్షన్ కింద నమోదు చేసిన కేసులపై బిజెపి లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో బండి సంజయ్ పై నమోదైన కేసుల పై కూడా ఇవాళ విచారించిన కోర్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బెయిల్ నిరాకరించింది. బండి సంజయ్ ను14 రోజుల రిమాండ్ విధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసిన కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్. ఈనెల 17 వరకు జ్యూడీషియల్ రిమాండ్ కు తరలిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది..కోర్టు. సంజయ్ సహా మరో ఐదుగిరికి రిమాండ్ విధించారు.

Related posts

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు: సిపిఐ 

Satyam NEWS

ముంపు ప్రదేశాలను తనిఖీలు చేసిన ములుగు జిల్లా కలెక్టర్

Satyam NEWS

ముస్లింలు ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment