34.2 C
Hyderabad
April 23, 2024 14: 51 PM
Slider ప్రత్యేకం

వరద సాయంలోనూ తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష

#puvvada

2020 లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ట్విట్టర్ ద్వారా  మంత్రి పువ్వాడ ఎండగట్టారు. 2021-22 లో వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల (ఎన్‌డి‌ఆర్‌ఎఫ్) వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. కేంద్ర నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మంత్రి పువ్వాడ, ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రం పేరు లేకపోవడాన్ని ప్రస్తావించారు. 

వరదల సమయంలో సీఎం కేసీఆర్  బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని పేర్కొన్నారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న  వివక్షపూరిత వైఖరితో మనసు కలచి చేస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు. 2021-22 లో అనేక రాష్ట్రాలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణ కు మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకున్నదన్నారు. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులివ్వాలని సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రికి గతంలోనే లేఖ రాసిన విషయం గుర్తుచేశారు. కానీ ఇప్పటిదాకా కేంద్రం నుంచి నయాపైసా రాలేదన్నారు.  

Related posts

మంత్రి బొత్స జ‌న్మ‌దినం సంద‌ర్బంగా బ్రాహ్మ‌ణుల సేవా కార్య‌క్ర‌మం…!

Satyam NEWS

ఆటో,వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పూర్తి మద్దతు

Satyam NEWS

Leave a Comment