32.2 C
Hyderabad
March 28, 2024 22: 30 PM
Slider కరీంనగర్

వంటగ్యాస్ భారం మొత్తం కేంద్రానిదే: మాకు సంబంధం లేదు

#ministerharishrao

వంట గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూ రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు సవాల్ విసిరారు. 291 రూ ట్యాక్స్  ఉన్నదని రుజువు చేయకపోతే ఎన్నికల నుండి తప్పుకుంటావా…రాజేందర్ అని ఆయన ప్రశ్నించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాగంగా నేడు పెంచికల్ పేట సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈటల రాజేందర్ చేరింది బీజేపీ పార్టీ. గ్యాస్ సిలండర్ వేయి రూపాయలు చేసింది ఆపార్టీ అని ఆయన అన్నారు.

సిలిండర్ ధర పెంచినా మీకు తిప్పలయినా నాకు ఓటు వేయండని అంటాడా….గ్యాస్ బండ ధరలో 291 రూపాయలు  రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని చెబుతున్నడు. ట్యాక్ వేసి ఉంటే ఎక్కడకు రావాలి. ఒక వేళ 291 రూపాయలు గ్యాస్ సిలిండర్ పై పన్ను వేసి ఉంటే ఇవాళ రమ్మంటావా….. రేపు రమ్మంటావా జమ్మికుంటు గాంధీ బొమ్మకాడకు రమ్మంటవా…హుజూరాబాద్  అంబేద్కర్ బొమ్మ కాడకు రమ్మంటవా. రా ష్ట్ర ప్రభుత్వం 291 రూపాయలు పన్ను వేసి ఉంటే నేను అక్కడ్నే రాజీనామా చేస్తా..నువు ఎన్నిక నుండి తప్పుకుంటవా అని అడుగుతున్న. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధర, మంచి నూనే పెంచింది నీ ప్రభుత్వం కారణం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు.

30వ తేదీన ఓటు వేసేముందు వంట రూంలోకి వెళ్లి గ్యాస్ బండకు దండం పెట్టండి. కసి కసిగా కారు గుర్తుకు ఓటు వేయండి అని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Related posts

సిపిఐ నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ

Bhavani

రోడ్డును ప్లాట్ చేసి అమ్ముకున్న ఘనులు

Satyam NEWS

బదరీనాథ్ విశిష్టత: పిండ ప్రదానాలకు బ్రహ్మకపాలం సిద్ధం

Satyam NEWS

Leave a Comment