32.2 C
Hyderabad
April 20, 2024 19: 25 PM
Slider నల్గొండ

BJP ప్రభుత్వం తన మొండి విధానాలను విడనాడాలి

#CITUHujurnagar

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ గా పోరాడి సాధించుకున్న హక్కులను ప్రైవేటీకరించడం బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, తక్షణమే అట్టి విధానాన్ని విరమించుకోవాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో CITU ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మని దగ్ధం చేసిన అనంతరం రోషపతి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేడు సంవత్సరాల కాలంలో భారతదేశంలోని రష్యా ప్రభుత్వ సహకారంతో నిర్మించిన విశాఖ ఉక్కు ,లక్షల కోట్ల సంపద ఉన్న BSNL, రైల్వే, బ్యాంకు వ్యవస్థను, ఎల్ఐసి,ఇన్సూరెన్స్,విద్యుత్, ప్రభుత్వ భూములను ఒకటోకటిగా  అన్నిటిని ప్రైవేటీకరణకి బడా పెట్టుబడిదారులకు అమ్మేసి భారత పౌరులకు నాదనేది ఏమీ లేకుండా అన్నిటిని అంబానీ, ఆదాని లాంటి పెట్టుబడిదారులకు భారతదేశాన్ని  అమ్మేస్తుందని,భావితర భారత పౌరులకు ఏమీ లేదని విమర్శించారు.

బిజెపి ప్రభుత్వం తక్షణమే కార్మికుల 4 లేబర్ కోర్టు రద్దు చేయాలని, వ్యవసాయ మూడు చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక,కర్షక, ప్రభుత్వరంగ వ్యతిరేక బడ్జెట్ సమూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. మోడీ కార్పొరేట్ విధానాలు విరమించు కోవాలని, పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని నినాదాలతో డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.

ఈ కార్యక్రమంలో CITU నాయకులు గుండెబోయిన వెంకన్న,అంజి, సాముల కోటమ్మ, రెడీతి వెంకన్న, బాలయ్య, కనకయ్య, మొదాల గోపమ్మ, సుజాత, గోవిందమ్మ, శారద, బుజ్జి, పద్మ, లక్ష్మి,ఎల్లప్ప, కోటేశ్వరరావు, పర్వతాలు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈనెల 27న ఖమ్మంలో సిపిఎం ప్లీనం

Murali Krishna

Analysis: నీటి గండాలు గట్టెక్కేదెట్లా?

Satyam NEWS

ఆరుద్ర మహోత్సవం నాడు జంగమదేవర్లకు అన్న వస్త్రదానాలు

Bhavani

Leave a Comment