31.7 C
Hyderabad
April 25, 2024 02: 06 AM
Slider సంపాదకీయం

కమలానికి కలిసి వచ్చే కాలం ఇది కాదు

#NarendraModi

పెరుగుతున్న పెట్రోలు ధరల మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే బీజేపీ అదృష్టం ఏమిటంటే ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఉనికి కూడా లేదు. అందువల్ల ఆ పార్టీకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు.

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో ఆశలు రేపేది ఒక్క అసోం మాత్రమే. గత ఎన్నికలలో అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ తో కలిసి మొత్తం 126 స్థానాలకు 86 సీట్లు గెలుచుకున్నది బీజేపీ. ఈ సారి అక్కడ పరిస్థితులు బిజెపి మిత్రులకు అంతగా అనుకూల పవనాలు వీచడం లేదు.

ఏఐయుడిఎఫ్ అక్కడి బీజేపీకి చుక్కలు చూపిస్తున్నది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వంటరిగా పోటీ చేసింది. అయితే ఇప్పుడు ఈ డెమోక్రాటిక్ ఫ్రంట్ తో కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నది. అదే సమయంలో అసోం గణ పరిషత్ లో చీలికలు కూడా బీజేపీ మిత్రులకు నష్టం చేకూర్చబోతున్నాయనేది పరిశీలకుల అంచనా.

కేరళ రాష్ట్రం విషయానికి వస్తే అక్కడ బీజేపి తల్లకిందులుగా తపస్సు చేస్తున్నా ఏ మాత్రం ఫలితం రావడం లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఓటు బ్యాంకులకు బీజేపీ చిల్లు పెట్టడం కల్ల అనే పరిస్థితి ఉంది. తమిళనాడులో బీజేపీ పాగా వేయడం దాదాపుగా సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

అన్నాడిఎంకె బిజెపి కూటమిని అక్కడి ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారు.  ఈ సారి డిఎంకె, కాంగ్రెస్ కూటమికి అధికారం సంప్రాప్తించవచ్చుననేది రాజకీయ పరిశీలకుల అంచనా. హిందీని తీవ్రంగా వ్యతిరేకించే తమిళ ప్రజలు బీజేపీకి ఓటు వేయడం అక్కడ కుదిరేపని కాదు.

బీజేపీ శక్తి మొత్తం కూడదీసుకుని పోటీ చేస్తున్నది ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే. అక్కడ 1989లో కేవలం 2 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 2019 నాటికి తన ఓట్ల శాతాన్ని 40 కి పెంచుకోగలిగింది. అప్పుడు 22 పార్లమెంటు స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి.

ఆ విజయం ఆధారంగా అంచనా వేసుకుంటే బీజేపీకి 126 సీట్లు రావాల్సి ఉంది. అయితే పార్లమెంటు ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉందని ఈ సారి బీజేపీ మంచి ఫలితాలు సాధించే అవకాశం లేదని కూడా రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత కిషోర్ అయితే బిజెపికి రెండు అంకెల సీట్లు కూడా రావని తేల్చి చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిష్టగా తీసుకున్న బెంగాల్ ఎన్నికలు ఒక్కటే బీజేపీకి కొద్దిగా ఆశలు రేకెత్తిస్తున్నాయి.

అయితే ఆ రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలు తీవ్రంగా ప్రభావం చూపిస్తే అమిత్ షా చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఏ విధంగా చూసినా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకులకులకు అంతగా ఉత్సాహం నింపే అవకాశం కనించడం లేదు.  

Related posts

Breaking News: శ్రీలంకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం

Satyam NEWS

ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకి వేతనాలు పెంచాలి

Bhavani

Analysis: గెలిచింది ఎవరైనా ఓడింది మాత్రం ఓటరే

Satyam NEWS

Leave a Comment