37.2 C
Hyderabad
March 28, 2024 18: 33 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

టి ఆర్ ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న బిజెపి

ch vidyasagararao

తెలంగాణపై కన్నేసిన కమలం త్వరలోనే టి ఆర్ ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మాస్టర్ స్ట్రోక్ అంటే ఏదో ఊహించుకోవద్దు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ మాస్టర్ స్ట్రోక్ అన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపికి జనాకర్షణ గల నాయకుడు లేడు. ఎంత కొట్టుకున్నా తెలంగాణ సి ఎం కేసీఆర్ ను సవాల్ చేసే స్థాయి ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారెవరికి వచ్చే అవకాశం  కూడా లేదు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి నాయకుడు లేని లోటును ఇప్పటికే పసిగట్టిన బిజెపి అధిష్టానం అందరిని ఆశ్చర్యపరచే నిర్ణయాన్ని మరో రెండు నెలల్లో వెల్లడి చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇది బయటకు వచ్చేది కాదు కానీ సత్యం న్యూస్ కు విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీ ఆర్ పై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు అప్పటిలోనే బిజెపి గుర్తించింది. ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ ఒడిసి పడుతుందేమోనని భావించిన ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు తెలంగాణ పై పూర్తి దృష్టి కేంద్రీకరించారు. బిజెపి రాష్ట్రాల ముఖ్యమంత్రులందరిని రాష్ట్రంలో మోహరించారు. అయితే ఫలితం కాంగ్రెస్ తో బాటు బిజెపికి కూడా చుక్కలు కనపడేలా చేసింది. ఐదు స్థానాలున్నబిజెపి ఒకటికి కుచించుకుపోయింది. ఓటమి తర్వాత రిపోర్టులను విశ్లేషించుకుంటే బిజెపికి తదుపరి ఎన్నికలలో ఏం చేయాలో బోధపడింది. తెలంగాణలో కేసీ ఆర్ ను సవాల్ చేసే నాయకుడు లేకపోవడమే పెద్ద లోటుగా బిజెపికి రిపోర్టులు అందాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కేసీ ఆర్ ను పోల్చి చూసుకున్న తెలంగాణ ప్రజలు కేసీ ఆర్ వైపే మొగ్గు చూపారు. కేవలం ధీటైన నాయకుడు లేకపోవడం వల్లే కేసీ ఆర్ అంత వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోగలిగారనేది బిజెపి పరిశీనలలో తేలిన పెద్ద విషయం. తాజాగా పరిస్థితి చూసుకున్నా కూడా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కు సి ఎం స్థాయి లేదు. బండారు దత్తాత్రేయ ఆశించిన రీతిలో పని చేసే పరిస్థితిలో లేరు. జి.కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా చేయడం వరకూ ఓకే కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి ఉండదు. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సి హెచ్ విద్యాసాగర్ రావును బిజెపి అధిష్టానం ఎంపిక చేసుకున్నది. రెండు మూడు నెలల్లో సి హెచ్ విద్యాసాగర్ రావును తెలంగాణ బరిలోకి దించే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. 2014 ఆగస్టు నెలలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా వెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఏ మాత్రం వివాదాల జోలికి వెళ్లకుండా ఎంతో చక్కగా తన బాధ్యతలను నిర్వర్తించారు.-సత్యం న్యూస్- వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీకి ఎంతో గౌరవ భావం ఉండేది. విద్యాసాగరరావు వ్యవహార శైలి ఎంతో ఉన్నతంగా ఉంటుందని నరేంద్ర మోడీ కి బాగా తెలుసు. అదే విధంగా అమిత్ షా కూడా విద్యాసాగరరావు అంటే ఎంతో అభిమానిస్తారు. తెలంగాణ ప్రజలలో విద్యాసాగరరావుకు ఎంతో మంచి పేరు ఉన్నది. వివాదరహితుడైన విద్యాసాగర్ రావు అయితే తెలంగాణ ప్రజలు అందరూ కూడా కేసీ ఆర్ కు ప్రత్యామ్నయంగా భావించడానికి అన్ని అవకాశాలు ఉంటాయని బిజెపి ఒక అంచనాకు వచ్చింది. విద్యాసాగర్ రావు రంగంలో దిగితే తెలంగాణ బిజెపిలో ఎదురుచెప్పే నాయకుడు ఎవరూ ఉండరు. పూర్తి బాధ్యతలు విద్యాసాగర్ రావుకు అప్పగిస్తే మోడీ గానీ, అమిత్ షా గానీ తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఈ కారణాలన్నింటి దృష్ట్యా విద్యాసాగర్ రావును తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా నియమించేందుకు బిజెపి అధిష్టానం పావులు కదుపుతున్నది. గవర్నర్ గా దాదాపు 5 సంవత్సరాలుగా పని చేస్తున్నందున ఆయనను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు బిజెపి నిర్ణయం తీసుకున్నది.

Related posts

బాబాయి హత్య: ఇంకా వెలుగులోకి రావాల్సిన నిజాలు ఎన్నో

Bhavani

సుప్రీంకోర్టు తీర్పు తో ముస్లిమ్ రిజర్వేషన్లకు ముప్పు

Satyam NEWS

ముగ్గురికి మునుగోడు ప్రతిష్ఠాత్మకం

Murali Krishna

Leave a Comment