21.7 C
Hyderabad
November 9, 2024 05: 27 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

స్వామీ చిన్మయానందా? ఎంత పని చేశావయా?

swamy chinmayananda

వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేసిన బిజెపి నాయకుడు స్వామి చిన్మయానంద పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో స్వామి చిన్మయానంద పేరుతో ఒక ట్రస్టు ఉంది. ఈ ట్రస్టు అక్కడ లా కాలేజీ నడుపుతున్నది. ఎల్ఎల్ బి చదువుతున్న ఒక విద్యార్ధిని ఈ నెల 24న కాలేజీ నుంచి మాయం అయింది. ఎక్కడకు వెళ్లిందో తెలియదు. ఒక రోజు తర్వాత ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, కాలేజీలో తాను ఈ వేధింపులను తట్టుకోలేకపోతున్నానని ఆ అమ్మాయి ఎంతో ఆవేదనతో పోస్టు పెట్టింది. ఇది చూసిన కొందరు న్యాయవాదులు ఆ అమ్మాయి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతికి తమ ముందుకు తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చింది. స్వామి చిన్మయానంద తన లాంటి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని ఆ అమ్మాయి తెలిపింది. చివరకు పోలీసులు ఆ అమ్మాయిని రాజస్థాన్ లో కనుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్ ఓపి సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆ అమ్మాయి కోసం తాము రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో వెతికామని చివరకు రాజస్థాన్ లో ఆ అమ్మాయి కనిపించిందని తెలిపారు. ఆ అమ్మాయిని కోర్టులో ప్రవేశపెడతామని ఆయన అన్నారు. స్వామి చిన్మయానంద పై ఆ అమ్మాయి తండ్రి కూడా ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా హత్యాయత్నం చేశాడని తండ్రి చేసిన ఆరోపణలపై షాజహాన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్తాన్ లో ఆ అమ్మాయి ఎక్కడ కనిపించింది పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆ అమ్మాయి తన ఫ్రండ్ తో ఉన్నట్టు మాత్రమే చెప్పారు.

Related posts

ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాల పై ఆంక్షలు

Satyam NEWS

విజయనగరం జిల్లా స్థాయ ఉద్యోగుల క్రీడా పోటీల‌ల్లో..పౌర సంబంధాల స‌మాచార శాఖ

Satyam NEWS

ఫ్లెక్సీ తొలగించమని చెప్పాం: అధికారులే బాధ్యులు

Satyam NEWS

Leave a Comment