36.2 C
Hyderabad
April 25, 2024 22: 44 PM
Slider కరీంనగర్

దొంగ దీక్షలు: బిజెపి నాయకులకు వ్యవసాయం అంటే తెలుసా

33333

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వేములవాడ మండలం లోని రుద్రవరం సింగల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవ రావు తెలిపారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు గోస దీక్ష చేపట్టిన బిజెపి నాయకులకు వ్యవసాయం అంటే తెలుసా విత్తనాలు చల్లడం నుండి పొట్టకొచ్చే దశ వరకు పంటను ఏ విధం గా పండిస్తారని బీజేపీ నాయకులకు తెలుసా అని అయన ప్రశ్నిచారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బిజెపి నాయకుల కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో ప్యాక్స్, మార్కెట్ కమిటీ, ఐకెపి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటను60 శాతం వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్న తరుణంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇబ్బంది కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారని అయన తెలిపారు.

బిజెపి నేతలు  రైతులకు మద్దతుగా కేంద్రప్రభుత్వం ద్వారా సాయం అందించాలి కానీ ఇలాంటి విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

Related posts

మంత్రి పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పలో పోటీచేయాలి

Satyam NEWS

ప్రభుత్వ ఆస్తులను మనమే కాపాడుకోవటానికి సమరమే శరణ్యం

Satyam NEWS

కేంద్రం, రాష్ర్ట ప్ర‌భుత్వాలు దొందూ దొందే!

Sub Editor

Leave a Comment