36.2 C
Hyderabad
April 24, 2024 21: 38 PM
Slider నిజామాబాద్

రఘునాథ చెరువును కాలుష్యం నుంచి కాపాడండి

#BJP Nizamabad City

తాగునీటి వనరు అయిన రఘునాథ చెరువును కలుషితం కాకుండా కాపాడాలని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పట్టణ శాఖ మునిసిపల్ కమిషనర్ ను కోరింది. నివాసాలకు దగ్గరగా ఉన్న బ్రాహ్మణ కుంట అలుగు నీరు కలుషితమై రఘునాథ చెరువులో కలుస్తున్నదని బిజెపి నగర అధ్యక్షుడు యెండల సుధాకర్ తెలిపారు.

ఈ మేరకు బిజెపి ప్రతినిధి బృందం మునిసిపల్ కమిషనర్ ను నేడు కలిసింది. ముందుగా బిజెపి నగర అధ్యక్షులు యెండల సుధాకర్ అధ్యక్షతన బిజెపి ప్రతినిధి బృందం బ్రాహ్మణ కుంట అలుగు ను సందర్శించింది. అక్కడి నుంచి నీళ్లు మురుగు కాలువ ద్వారా రఘునాథ చెరువులో కలవడం వల్ల తాగునీరు కలుషితం అవుతున్నదని వారు మునిసిపల్ కమిషనర్ కు విన్నవించారు.

మునిసిపల్ కమిషనర్ ను కలిసిన వారిలో బిజెపి నగర ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు నారాయణ యాదవ్, మునీర్, వేణు,మారుతి, విజయ్, శంకర్  తదితరులు ఉన్నారు.

Related posts

వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రావాల్సిందే

Satyam NEWS

కరోనా కట్టడికి ఎంపి మిధున్ రెడ్డి సహాయం

Satyam NEWS

జూన్ 17వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్ల‌ జారీ

Satyam NEWS

Leave a Comment