37.2 C
Hyderabad
March 29, 2024 17: 41 PM
Slider కృష్ణ

చీప్ లిక్కర్ ఉత్సాహంలో బిజెపి నేతలు ఏం చేశారంటే…….

#BJPAP

ఆంధ్రప్రదేశ్ బిజెపి లో కొత్త ఉత్సాహం తొంగి చూస్తున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ పథకం ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పార్టీలో ఇంత త్వరగా ఉత్సాహం పెల్లుబుకుతుందని ఎవరూ ఊహించలేదు. సోము వీర్రాజు ఊహించినట్లుగానే చీప్ లిక్కర్ ప్రకటన తర్వాత పార్టీలో ఉత్సాహం ఎక్కువైంది. ఉత్సాహం ఎంత ఎక్కువ అయింది అంటే పార్టీ ఆఫీసులోనే రికార్డింగ్ డాన్సులు చేసుకుంటున్నారు. చీప్ లిక్కర్ తో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక చేయాల్సింది ఏమిటో విజయవాడ బిజెపి నాయకులు చేసి చూపిస్తున్నారు. చీప్ లిక్కర్ తాగి ఆ తర్వాత రికార్డింగ్ డాన్సులు చేయడమే తరువాయి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. విజయవాడ సిటీ బిజెపి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా ఆనందంలో ఆరేసుకోబోయి పారేసుకుంటానంటూ మహిళలు, పార్టీ కార్యకర్తలు చిందేశారు. న్యూ ఇయర్ సందర్భంగా సంబరాలు చేసుకున్న నేతలు, కార్యకర్తలు అశ్లీల నృత్యాలతో అందరికి ఆదర్శంగా నిలిచారు. బిజెపి అధికారంలోకి రాగానే తమ ప్రాధాన్యతలు ఏమిటో ప్రాక్టికల్ గా చేసి చూపించినట్లు అయిందని కొందరు ఈ వీడియోను చూసి వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

అగ్లీ ఫెలోస్: బాలికపై పై కిరాతకానికి పాల్పడ్డ నీచులు

Satyam NEWS

జీతాల కోసం క్లాప్ మిత్రల డిమాండ్

Satyam NEWS

ప్రజల కోసం పోరాడే టీడీపీ నేతల్ని అరెస్టులతో ఆపలేరు

Satyam NEWS

Leave a Comment