37.2 C
Hyderabad
March 29, 2024 17: 26 PM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ లో చేరబోతున్న బిజెపి ఎంపి తండ్రి

#dsrinivas

సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్‌ సొంత గూటికి రాబోతున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎంపీ గా ఉన్న ఆయన ఆ పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత దక్కకపోవడంతో ఎంతో అసంతృప్తితో ఉన్నారు. రాజకీయంగా డీఎస్‌ ఎదుగుదలంతా కాంగ్రెస్‌ పార్టీలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగింది. ఈ నేపథ్యంలోనే డీఎస్ కాంగ్రెస్‌‌లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌ డీఎస్‌ ఇంటికి వెళ్లి డీఎస్‌ను పరామర్శించారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు బీజం పడిందని చెబుతున్నారు. రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్ చిన్న కుమారుడు అరవింద్ బిజెపి ఎంపిగా ఉన్నారు. బిజెపి ఎంపి తండ్రి కాంగ్రెస్ లో చేరబోతుండటం గమనార్హం. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Related posts

ఇమ్మానియేల్ చర్చ్ లో ఘనంగా యేసు పునరుత్థాన పండుగ

Satyam NEWS

ఆయుర్వేదం వైపు అడుగులు!

Bhavani

యోగ పుట్టిన దేశంలో వ్యాయామం లేక యువత నిర్వీర్యం

Satyam NEWS

Leave a Comment