26.9 C
Hyderabad
January 16, 2021 19: 43 PM
Slider సంపాదకీయం

బీజేపీ జాతీయ స్థాయి ఆంధ్రా నేతలు హైదరాబాద్ రారేమీ…?

#BJPLeaders

జీహెచ్ఎంసి ఎన్నికలలో ప్రచారం కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతో మంది గొప్ప నాయకులను బిజెపి రంగంలో దించుతున్నది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ లాంటి వారు కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.

ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీ లాంటి వారు వచ్చారు. ఇదంతా ఒకే కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి రావడం లేదేమిటి? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశం అయింది.

ఏపిలోని బిజెపి నాయకులు చాలా మంది హైదరాబాద్ కు నిరంతరంగా వస్తూనే ఉంటారు. చాలా మందికి హైదరాబాద్ లో సొంత ఇళ్లు కూడా ఉన్నాయి. అయితే ఒక్కరు కూడా ప్రచారం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాతీయ స్థాయి నాయకులు లెక్కకు మించే ఉన్నారు.

జీవీఎల్ నర్సింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, సుజనా చౌదరి, రాంమాధవ్ లాంటి వారు జాతీయ స్థాయి నాయకులు. తెలుగు వారైన వీరంతా హైదరాబాద్ ఎన్నికలలో మాత్రం కనిపించడం లేదు. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు దుబ్బాకలో గెలిచిన రఘునందన్ ను అభినందించారు కానీ జీహెచ్ఎంసి ఎన్నికలలో తన వంతుగా ప్రచారం చేసేందుకు మాత్రం రావడం లేదు.

హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వారి ఓట్లు అభ్యర్ధుల గెలుపు ఓటములలో కీలక ప్రభావం చూపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిజెపి నాయకులు వచ్చి ప్రచారం చేస్తే హైదరాబాద్ బిజెపికి ఊపు వస్తుంది కానీ ఎవరూ రావడం లేదు. బిజెపి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిందని ఇప్పటికే ఉన్నందున, తాజాగా పోలవరం ప్రాజెక్టు అమరావతి తరలింపు తదితర అంశాలలో కూడా బిజెపి ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నదని అందరూ అనుకుంటున్న సమయంలో ఆంధ్రా నుంచి బిజెపి నాయకులు వచ్చి హైదరాబాద్ లో ప్రచారం చేస్తే బిజెపికి ఓటు వేసే సెటిలర్లు కూడా వెయ్యకుండా ఉంటారని అందువల్లే బిజెపి నాయకులు హైదరాబాద్ ప్రచారానికి రావడం లేదని కూడా అంటున్నారు. ఏ విషయం ఆంధ్రా బిజెపి నేతలే చెప్పాలి.  

Related posts

ఫైటింగ్ మూడ్: జనసేన వైకాపాల మధ్య ఘర్షణ రాళ్లదాడి

Satyam NEWS

హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు రోజంతా అనుమ‌తి

Satyam NEWS

కొత్త ఏడాది తొలి రోజు మందుకే రూ.430 కోట్లు ఖర్చు

Satyam NEWS

Leave a Comment