32.7 C
Hyderabad
March 29, 2024 10: 46 AM
Slider ప్రత్యేకం

కర్నాటక తరహాలో ఉద్యమించి అధికారం చేజిక్కించుకుందాం

#bandi sainjai

తెలంగాణలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోందని,కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం? అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. కర్నాటక తరహాలో ఉద్యమిద్దాం. అధికారం చేజిక్కించుకుందాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

పార్టీ కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించండి అని బండి సంజయ్ కోరారు.  ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనే కార్యకర్తలకు అవగాహన కల్పించే అంశంపై  ఈరోజు హైదరాబాద్ లోని నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు హాజరైన ఈ వర్క్ షాప్ కు  బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జీ, ఎంపీ మునుస్వామి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పాదయాత్ర సహ ప్రముఖ్  తూళ్ల వీరేందర్ గౌడ్, మల్లారెడ్డి, కట్టా సుధాకర్, కడగంచి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ పాదయాత్ర విజయవంతం చేయాలి

ఈ వర్క్ షాపులో తొలుత మనోహర్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ తో  కలిసి ప్రజా సంగ్రామ యాత్రలో నడిచే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా ఆరోగ్యం, వసతి, భోజనం వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అదే విధంగా పాదయాత్ర సక్సెస్ చేసేందుకు కార్యకర్తలు అనుసరించాల్సిన పద్దతులను వివరించారు. 

ఎంపీ మునుస్వామి మాట్లాడుతూ…. బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రను ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాలని కోరారు.  ‘‘పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు? ఎవరు పార్టీ కోసం బూత్ స్థాయి నుండి నిరంతరం శ్రమిస్తున్నారు. అనే విషయాలను నిశితంగా పరిశీలించేందుకే కేంద్రం తనను ప్రతినిధిగా పంపింది. అందరూ కష్టపడి పనిచేయాలి’’అని పేర్కొన్నారు. 

కష్టపడి పని చేసే వారికి పదవులు                          

పాదయాత్ర లో భాగంగా రాష్ర్టంలోని అన్ని నియోజక వర్గాల్లో మండల, జిల్లా నాయకుల, వివిధ మోర్చాల పనితీరు పై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తించి తగిన పదవులిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

ముఖ్యంగా పాదయాత్రలో టీఆరెస్ అవినీతి, నియంత పాలనను ఎండగట్టడంతోపాటు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వంటి హామీల అమలులో కేసీఆర్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగం చేశారు.

కరోనా వల్లే ఇంత కాలం ప్రజలకు చేరువ కాలేకపోయాం

ఈనెల 24న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభించనున్న ప్రజా సంగ్రామ యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని తనతో నడిచేందుకు సిద్ధం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకే పాదయాత్ర చేపట్టాలని తాను నిర్ణయించానని, బీజేపీ అధ్యక్షుడైన కొత్తలోనే పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఇన్నాళ్లూ వాయిదా వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.      2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు తాను దశల వారీగా పాదయాత్రను కొనసాగిస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.

నయా నిజాం పాలనతో ప్రజలకు ఇక్కట్లు

నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో గడీల, కుటుంబ పాలన కొనసాగుతోంది. అవినీతి, నియంత పాలనతో పేదలు తీవ్రమైన ఇబ్బందులపాలవుతున్నారని తెలిపారు.బీజేపీ కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ మూర్ఖత్వ, నయా నిజాం పాలనవల్ల కష్టాలు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ గడీల పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలంతా ఈసారి బీజేపీకి  అవకాశం ఇవ్వాలని భావిస్తున్నానన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, బాధలు, కన్నీళ్లను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతోనే పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు.

వారి బాధలు, సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారికి అండగా ఉండేందుకు, వారి సమస్యల ఆధారంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు.      గడీలను బద్దలు కొట్టడం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం. టీఆర్ఎస్ మెడలు వంచి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని కరీంనగర్ ఎంపీ ,తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.

కేసీఆర్ మోసాలకు దొంగ హామీలకు అంతులేకుండాపోయింది

కేసీఆర్ మోసాలకు, దొంగ హామీలకు అంతు లేకుండా పోయింది. చివరకు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లిస్తూ సొంత పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారన్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం? అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు.ఒకప్పుడు కర్నాటకలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనలాగే ఎన్నో ఉద్యమాలు చేసారని… ఓర్వలేని ఆనాటి పాలకులు కాషాయా జెండాపై  కక్ష కట్టి కార్యకర్తలను జైల్లో వేశారన్నారు. అయినా అక్కడి కార్యకర్తలు వెరవలేదు. పాలకులపై తెగించి యుద్దం చేశారని గుర్తు చేసారు. ఫలితంగానే కర్నాటకలో అధికారంలోకి వచ్చారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు.

బిజెపి వైపు మొగ్గు చూపుతున్న తెలంగాణ ప్రజలు

ఈసారి తెలంగాణ వంతు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంత, గడీల పాలనపట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. వారంతా బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ అధికారంలో రావడం ఖాయమనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు.          అందుకోసమే పాదయాత్ర చేస్తున్నా. ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడవడమే నా తక్షణ కర్తవ్యమన్నారు.. వారికి భరోసా ఇవ్వడమే నా ఉద్దేశం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తద్వారా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రెండేళ్లపాటు పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించాలిన సమయం ఆసన్నమైందని ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేసారు.

కుటుంబంతో గడిపే సమయం త్యాగం చేయండి

ఈ రెండేళ్ల పాటు కుటుంబ శ్రేయస్సు కంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, పార్టీ శ్రేయస్సు ముఖ్యమని భావించి పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.ఈ విషయంలో అవ్వ కావాలా? బువ్వ కావాలా? తేల్చుకోవాలి. పార్టీ కోసం కుటుంబంతో గడిపే సమయాన్ని కొంత వరకు త్యాగం చేయాలన్నారు. ఈ విషయంలో కుటుంబాలను ఒప్పించాలన్నారు. ఆ సమయాన్ని రాష్ట్ర ప్రజల కష్టాలను, బాధలను తుడిచేందుకే కేటాయించాలన్నారు. అంతిమంగా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు పనిచేయాలని కార్యకర్తలను దిశా నిర్దేశం చేసారు.

నిస్వార్థంగా, కమిట్ మెంట్ తో పనిచేస్తూ ప్రజా సంగ్రామ యాత్రలో పనిచేసే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని బీజేపీ అధ్యక్షుడు ఘంటా పదంగా నొక్కి చెప్పారు. చేసే పనిని బట్టే గుర్తింపు వస్తుందే తప్ప ఫొటోలకు ఫోజులిస్తే మాత్రం గుర్తింపు రాదని తీవ్రంగా ధ్వజమెత్తారు.కేసీఆర్ నియంత, అవినీతి, కుటుంబ పాలనతో తెలంగాణ తల్లి బందీ అయ్యిందన్నారు. ఆ తల్లిని విముక్తి చేయడమే లక్ష్యంగా తెగించి పోరాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 

Related posts

ఇండోనేషియాతో భారత్ కు బలమైన బంధం ఉంది

Bhavani

కేంద్ర ప్రభుత్వం తక్షణమే 12 శాతం గిరిజన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి

Satyam NEWS

డేంజర్ పోలీస్: రాష్ట్రపతి శౌర్యపురస్కారం ఉగ్రవాదులకు సహకారం

Satyam NEWS

Leave a Comment