36.2 C
Hyderabad
April 23, 2024 20: 00 PM
Slider కడప

మత మార్పుడులకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగీరా

#somu veerraju

ఏపీలో దేవాలయాల పరిరక్షణ పేరుతో బీజేపీ చేపట్టిన ఆలయాల సందర్శన కార్యక్రమం లో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి అలయంను సందర్శించారు.

కడప జిల్లా లో రెండో భద్రాద్రి గా పేరుపొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర బృందం సోమవారం సందర్శించింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీ రోడ్డు షో నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో చారిత్రక ఆలయాలపై ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

ఒంగోలు లో ఓ మంత్రి నియోజకవర్గ పరిధిలో మొత్తం సిలువలు ఏర్పాటు చేశారని ఎస్టీ లు చర్చిలకు రాలేదని వారి భూములను బలవంతంగా ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అడ్డు వచ్చిన వారిని దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వానికి చర్చిల మీద, దర్గాల మీద ఉన్న ప్రేమ హిందూ దేవా లయాలపై లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ఆదాయం వచ్చే దేవాలయాలను చూసుకుంటూ, చారిత్రాత్మక ఆలయాలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.

ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ట ను అడ్డుకుంటామని, అక్కడికి తరలి వెళతామని రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగీరా అని ప్రశ్నించారు.ఇంకా ఈ సభలో పలువురు నేతలు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు , రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సుధాకర్ యాదవ్ , నాగోతు రమేష్ నాయుడు , జిల్లా ప్రధాన కార్యదర్శులు వై సురేష్ రాజు,

పులి నరేందర్ రెడ్డి , ప్రశాంత్ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి కొండయ్య, రాష్ట్ర నాయకులు భానుప్రకాశ్ రెడ్డి సామంచి శ్రీనివాస్, చిరంజీవి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి రాయలసీమ నాలుగు జిల్లాల అధ్యక్షులు వివిధ మోర్చాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Satyam NEWS

ఓపీనియన్: నిషేధించాల్సిన యాప్ లు ఇంకా ఉన్నాయి

Satyam NEWS

కన్నుమూసిన కర్షక్ ఇండస్ట్రీస్ అధినేత

Satyam NEWS

Leave a Comment